డిసెంబర్ 21 అమెరికాలో నిర్వహించబోయే గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రంగం సిద్ధమవుతోంది. యుఎస్ లో మొదటిసారి ఇలాంటి వేడుక జరుగుతుండటంతో దీని కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా అంచనాల విషయంలో కొంచెం అటుఇటు ఊగుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీకి బజ్ పెంచే భారం దీని మీదే ఉంది. ఇందులో భాగంగానే నాలుగో లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తారని తెలిసింది. రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి, ఎస్జె సూర్య తదితర కీలక తారాగణంతో పాటు దిల్ రాజు, శంకర్ ఇలా మొత్తం టీమ్ పాల్గొనబోతోంది. అయితే ఇక్కడితో అట్రాక్షన్లు ఆగడం లేదు.
స్పెషల్ గెస్టుగా పుష్ప సృష్టికర్త సుకుమార్ వెళ్ళబోతున్నారని సమాచారం. రంగస్థలంతో ఈ కాంబో సృష్టించిన రికార్డులు అందరికీ గుర్తే. వింటేజ్ విలేజ్ జానర్ నే ఒక్క కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది ఈ బ్లాక్ బస్టరే. సుకుమార్ వెళ్లేందుకు ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఒకటి రామ్ చరణ్ 17 ఆయనదే. వచ్చే ఏడాది వేసవిలో సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. కేవలం అనౌన్స్ మెంట్ నుంచే అంచనాలు పెరిగాయి. రెండోది పుష్ప 2 విజయోత్సవాన్ని ఎన్ఆర్ఐలతో పంచుకునే సందర్భం దొరకడం. త్వరలో బన్నీ, రష్మిక మందన్న సక్సెస్ మీట్ కోసం అక్కడికి వెళ్లనున్నారనే వార్తల నేపధ్యంలో ఈ అప్డేట్ రావడం గమనార్హం.
యుఎస్ లో ఈవెంట్ అయ్యాక డిసెంబర్ 28 ట్రైలర్ లాంచ్ హైదరాబాద్ లో చేసేలా ప్రణాళిక వేస్తున్నారు. జనవరి 10 ఎంతో దూరం లేదు. ఇంకో నెల రోజులు మాత్రమే ఉంది. ఇంత పెద్ద గ్రాండియర్ కి పబ్లిసిటీ చాలా అవసరం. లక్నోలో చేసిన ఈవెంట్ సక్సెస్ అయినప్పటికీ పాట్నాలో పుష్ప 2కి వచ్చిన స్పందన ముందు తేలిపోయింది. సో సంథింగ్ బిగ్ అనేది జరగాలి. ఆ దిశగానే ఎస్విసి టీమ్ ప్లాన్ చేస్తోంది. ఆర్ఆర్ఆర్ మినహాయిస్తే సోలో హీరోగా రామ్ చరణ్ సినిమా చేసి ఏళ్ళు గడిచిపోవడంతో మెగా ఫ్యాన్స్ మంచి ఆకలి మీదున్నారు. అంచనాలు అందుకుంటే మాత్రం రికార్డుల మోత ఖాయం.
This post was last modified on December 10, 2024 1:35 pm
యాదృచ్చికమో లేక కాకతాళీయమో చెప్పలేం కానీ హీరో రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు మధ్య కాంబో రెండుసార్లు ఒడిదుడుకులకు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి కంకర్యాలు, స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల బాగోగులను పర్యవేక్షఇంచేందుకు ఏర్పాటైనదే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). ఏపీ ప్రభుత్వమే ఈ…
ఇప్పుడంతా టాలీవుడ్ లో సంక్రాంతి హడావిడి నడుస్తోంది. హిట్ టాక్ తో రెండు దూసుకుపోతున్నా బాక్సాఫీస్ డామినేషన్ మాత్రం పూర్తిగా…
తెలుగు మీడియా రంగంలో ఇప్పుడు ఏ పత్రికను చూసినా… ఏ ఛానెల్ ను చూసినా…వాటి వెనుక ఉన్న రాజకీయ పార్టీలు…
నిన్న డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో తమన్ బాగా ఎమోషనల్ అయిపోతూ సినిమాను చంపొద్దంటూ, సోషల్ మీడియాలో మరీ…
ఏపీలోని కూటమి సర్కారు శుక్రవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో కీలక విభాగం అయిన సీఐడీకి చీఫ్…