మీడియం రేంజ్ హీరోల మల్టీస్టారర్ గా రూపొందుతున్న భైరవంని వీలైనంత వేగంగా పూర్తి చేసి క్రిస్మస్ బరిలో దింపాలని నిర్మాతలు విశ్వప్రయత్నం చేశారు కానీ ఇప్పుడది సాధ్యపడేలా లేకపోవడానికి చాలా కారణాలు అడ్డు పడుతున్నాయి. కొద్దిరోజుల క్రితమే నారా రోహిత్ కు పితృ వియోగం కలగడం వల్ల బ్యాలన్స్ ఉన్న షూటింగ్ కి బ్రేక్ పడింది. తాజాగా మంచు మనోజ్ కుటుంబ గొడవలతో పాటు శారీరకంగా గాయపడటంతో డబ్బింగ్ తో పాటు ఇతర కార్యక్రమాలను పెండింగ్ ఉంచాల్సి వస్తోంది. బెల్లకొండ సాయిశ్రీనివాస్ అందుబాటులో ఉన్నప్పటికీ మిగిలిన ఇద్దరూ రాలేని పరిస్థితితో వాయిదా తప్పలేదు.
పోనీ కాంపిటీషన్ ఉన్నా పర్వాలేదు సంక్రాంతికి వెళదామా అంటే అంత విపరీతమైన పోటీలో సరైన థియేటర్లు దొరకడమే కష్టం. తమిళ హిట్ మూవీ గరుడన్ రీమేక్ గా రూపొందుతున్న భైరవంకు విజయ్ కనకమేడల దర్శకుడు. ఒరిజినల్ వెర్షన్ తో పోలిస్తే కొన్ని కీలక మార్పులు చేసి తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా రెడీ చేస్తున్నారు. గుడి భూముల అన్యాక్రాంతం, స్నేహం, మిత్ర ద్రోహం అంశాల చుట్టూ అల్లుకున్న ఈ కథలో మంచి ఎమోషనల్ డెప్త్ ఉంటుంది. పుష్ప 2 జాతర అంత కాకపోయినా ఇందులోనూ ఇంటర్వెల్ ని బ్లాస్ట్ చేసే ఒక ఎపిసోడ్ చాలా బాగా వచ్చిందట. అందుకే మేకర్స్ ధీమాగా ఉన్నారు.
ఇంకొంత కాలం ఆగాల్సి వస్తే మాత్రం భైరవంకి జనవరి చివరివారం దాకా ఆగడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఒకవేళ రోహిత్, మనోజ్ కనక తమ ఇబ్బందులను పక్కనపెట్టి సహకారం అందిస్తే పనులు వేగవంతం చేసి ఫస్ట్ కాపీ రెడీ చేస్తారు. ఫస్ట్ లుక్ పోస్టర్స్ వచ్చాక ఈ సినిమా మీద బజ్ పెరిగింది. పల్లెటూరి నేపధ్యం, ముగ్గురు హీరోలు, సాయిశ్రీనివాస్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న టాలీవుడ్ ఎంట్రీ లాంటి అంశాలు క్రమంగా హైప్ తీసుకొస్తాయి. మరి చివరికి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. తమిళంలో సూరి చేసిన పాత్రను సాయిశ్రీనివాస్ చేస్తుండగా, శశికుమార్ గా రోహిత్, ఉన్నిముకుందన్ గా మనోజ్ నటించాడు.
This post was last modified on December 10, 2024 10:52 am
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…
ఏపీలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో సంక్రాంతి వేడుకలు జరిగాయి.…
చాలా ఏళ్ల నుంచి నాసిరకం సినిమాలు తీస్తూ తనకున్న గొప్ప పేరునంతా పోగొట్టుకుని దర్శకుడిగా జీరో అయిపోయాడు రామ్ గోపాల్…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్.. ఈ వార్త బయటికి వచ్చినపుడు అందరూ ఆశ్చర్యపోయిన వాళ్లే. తెలుగులో సున్నితమైన లవ్ స్టోరీలు,…
నిజమే. కేవలం రూ.500 లను పెట్టుబడిగా పెట్టిన ఆ ట్రక్కు డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇదేదో ఎక్కడో…