బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన యానిమల్ వచ్చి ఏడాది దాటుతున్నా ఇంకా డిబేట్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇండియన్ ఐడల్ కొత్త సీజన్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు మరోసారి ప్రశ్నలు ఎదురుకునే పరిస్థితి వచ్చింది. మాములుగా ఎవరు అడిగినా, తన గురించి ట్వీట్ చేసినా పేలిపోయే సమాధానం చెప్పే ఈ విలక్షణ దర్శకుడు ఈసారి నవ్వుతూనే చురకలు వేశాడు. ముందో అమ్మాయి మాట్లాడుతూ యానిమల్ తనకు చాలా బాగా నచ్చిందని, మూడు గంటల ఇరవై నిమిషాల నిడివి ఉన్నా మూడుసార్లు చూశానని ఆనందంగా చెప్పుకొచ్చింది.
ఇంతే మోతాదులో యానిమల్ అస్సలు నచ్చని ఫ్రెండ్ ఉందని మానుషి అనే అమ్మాయిని స్టేజి పైకి పిలిచింది. ఆమె మాట్లాడుతూ యానిమల్ తనకూ నచ్చిందని, అయితే కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఎవరైనా తనను షూ నాకమని అడిగితే తనకు వ్యక్తిగతంగా సమస్యగా మారుతుందని అన్నప్పుడు మూడు వందల మందిని చంపిన హీరోకి అనిపించిందా అంటూ పంచు వేశాడు. యానిమల్ మీద గతంలో విమర్శలు చేసిన జావేద్ అక్తర్ ప్రస్తావన కూడా ఇద్దరి మధ్య వచ్చింది. యానిమల్ లాంటి సినిమాల వల్ల సమాజం చెడిపోతుందని ఆయన చేసిన కామెంట్స్ ని గుర్తు చేసింది.
ఒకవేళ జావేద్ సాబ్ కనక స్టోరీ రైటర్, గీత రచయిత కాకపోయి ఉంటే ఆయన మాటలను సీరియస్ గా తీసుకునేవాడినని కౌంటర్ వేశారు. కబీర్ సింగ్ లో చూపించిన టాక్సిక్ రిలేషన్స్ గురించి కూడా టాపిక్ వచ్చింది. జీవిత భాగస్వామిని చాచి చెంప మీద కొట్టడం తాను స్వాగతించనని, ఒకవేళ భర్త ఆ పని చేసినా ఒప్పుకోనని ఆ అమ్మాయి చెప్పడం పట్ల అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. దానికి సందీప్ వంగా బదులిస్తూ అది ప్రేమతో చేసేది. సినిమాలు వినోదం కోసం మాత్రమే చూడమని, ఏదో మెసేజ్ కావాలని, పాఠం నేర్చుకోవాలని అద్దాలు పెట్టుకుని చూడొద్దని ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో ఇక అటుపక్క నుంచి మాట్లాడేందుకు ఏమీ లేకపోయింది.
This post was last modified on December 9, 2024 6:52 pm
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…
తెలంగాణలోని అదికార కాంగ్రెస్ లో తిరుగుబాటు బావుటా ఎగిరిందని, ఆ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ…
ఒకప్పుడు అంటే పాతిక ముప్పై సంవత్సరాల క్రితం ప్రేక్షకులు పాటలు వినాలంటే ఆడియో క్యాసెట్లు ఎక్కువగా చెలామణిలో ఉండేవి. అంతకు…