బాలీవుడ్లో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా చాలా కష్టపడి ఎదిగిన హీరో అక్షయ్ కుమార్. అతను ఎప్పుడూ వివాదాల్లో తలదూర్చడు. బయట కూడా హీరో అనిపించుకునేలా ఎన్నో మంచి పనులు చేస్తుంటాడు. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటాడు. గత కొన్నేళ్లలో అనేక భారీ హిట్లతో తన ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను అమాంతం పెంచుకున్నాడు అక్షయ్. అతడి కొత్త సినిమా లక్ష్మీబాంబ్ మీదా మంచి అంచనాలే ఉన్నాయి.
దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని హాట్ స్టార్ నవంబరు 9 నుంచి స్ట్రీమ్ చేయబోతోంది. దీని ట్రైలర్ తాజాగా లాంచ్ అయింది. సౌత్ బ్లాక్ బస్టర్ కాంఛనకు రీమేక్ అయిన ఈ చిత్రం ఒరిజినల్ తరహాలోనే మాస్ ప్రేక్షకులను అలరిస్తుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ఐతే పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్న లక్ష్మీబాంబ్ ట్రైలర్‌కు యూట్యూబ్‌లో లైక్ కొట్టాలన్నా కొట్టలేరు. డిజ్‌లైక్ కూడా చేయలేరు. అలాగే కామెంట్ చేయాలన్నఆ చేయలేరు. వాటిని అక్కడ డిజేబుల్ చేసేశారు దాని మేకర్స్. ఇదంతా బాలీవుడ్ మీద జనాల్లో పెరిగిన నెగెటివిటీ తాలూకు భయమే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానంతరం బాలీవుడ్ నెపోటిజం బ్యాచ్ మీద నెటిజన్ల కోపం అలా ఇలా లేదు.
ఆలియా భట్ సహా చాలామందిపై ఆ కోపాన్ని చూపించారు. ఆమె నటించిన సడక్-2 ట్రైలర్‌ను డిజ్‌లైక్‌లతో ముంచెత్తారు. అలాగే మరో స్టార్ కిడ్ అనన్య పాండే నటించిన ఖాలిపీలి పరిస్థితీ ఇంతే. అక్షయ్ మీద ఇలాంటి నెగెటివిటీ ఏమీ లేకపోయినా సరే.. ఎందుకొచ్చిన గొడవ అని లైక్స్, డిజ్ లైక్స్‌తో పాటు కామెంట్ల బాక్స్ డిజేబుల్ చేసి పడేశారు. ఇది అక్షయ్ అభిమానులను నిరాశ పరిచింది.
This post was last modified on October 10, 2020 8:55 am
స్వలింగ వివాహాలకు చట్టబద్ధతకు నో.. తేల్చేసిన సుప్రీంస్వలింగ వివాహాలకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపై దాఖలైన పిటిషన్లపై కీలక…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే విజన్‌కు పరాకాష్ఠ. ఆయన దూరదృష్టి.. భవిష్యత్తును ముందుగానే ఊహించడం.. దానికి తగిన ప్రణాళికలు వేసుకుని…
తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అదేవిధంగా 38 మంది గాయపడ్డారు. వీరిలో మరో…
ఏం జరిగినా.. ఎంత జరుగుతున్నా.. కొన్ని కఠిన నిర్ణయాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించే తీరు.. ఆయన్ను అమితంగా…
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్…
ఇండియాలోనే మొదటిసారి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన సాంగ్ గా నానా హైరానా గురించి దర్శకుడు శంకర్ ఎంత గొప్పగా…