ప్రతిభ ఉంటే పరిశ్రమ త్వరగానో ఆలస్యంగానో ఖచ్చితంగా గుర్తిస్తుందనే దానికి చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. కొన్ని అనూహ్యంగా ఉంటాయి. అలాంటిదే ఇది. సూర్య హీరోగా ఆర్జె బాలాజీ దర్శకత్వంలో ఇటీవలే ఒక ప్యాన్ ఇండియా మూవీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. దర్శకత్వంలో సీనియారిటీ లేకపోయినా ముకుతి అమ్మన్ (అమ్మోరు తల్లి)ని హ్యాండిల్ చేసిన విధానం చూసి బాలాజీకి సూర్య అవకాశం ఇచ్చాడు. అయితే దీనికి ముందు లాక్ చేసుకున్న సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. కానీ తాజాగా ఆయన తప్పుకుని ఆ స్థానంలో సాయి అభ్యంక్కర్ అనే 20 ఏళ్ళ కుర్రాడు వచ్చాడు.
ఇంత చిన్న వయసులో సూర్యలాంటి స్టార్ కు పని చేయడమంటే మాటలు కాదు. దీనికన్నా ముందు లోకేష్ కనగరాజ్ నిర్మిస్తున్న బెంజ్ కు మ్యూజిక్ డైరెక్షన్ ఛాన్స్ దక్కించుకున్న సాయి అభ్యంక్కర్ ఈ ఏడాదే కచ్చి సెర అనే ఆడియో సింగల్ తో సంగీత ప్రపంచానికి దగ్గరయ్యాడు. ఇది యూట్యూబ్ లో ఏకంగా 135 మిలియన్ల వ్యూస్ సాధించి చార్ట్ బస్టర్ అయ్యింది. ఆశ కూడ అనే మరో సాంగ్ దీన్ని దాటేసి 150 మిలియన్లు అందుకుంది. ఇవి చూసే లోకేష్ పిలిచి మరీ బెంజ్ ఛాన్స్ ఇచ్చాడు. ఏడాది కాలంలోనే సాయి అభ్యంక్కర్ ఇంత అచీవ్ చేయడం చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.
అయితే రెహమాన్ తప్పుకోవడానికి కారణం రెహమాన్ కొంత విశ్రాంతి కోరడమేనని చెన్నై మీడియా టాక్. నిజానికి ఆయన చేతిలో పది దాకా సినిమాలున్నాయి. వాటిలో రామ్ చరణ్ 16 ఒకటి. బుచ్చిబాబు దర్శకత్వంలో మూడు పాటల కంపోజింగ్ కూడా అయ్యింది. ఇంత బిజీ షెడ్యూల్ లో సూర్య 45కి న్యాయం చేయలేనని భావించి నో చెప్పినట్టు అంటున్నారు. అయితే క్రియేటివ్ డిఫరెన్స్ కూడా వచ్చి ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా కంగువ ఇచ్చిన షాక్ నుంచి కోలుకున్న సూర్య ఇకపై పలు విషయాల్లో జాగ్రత్తగా ఉండబోతున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సూర్య 44 వచ్చే వేసవిలో రిలీజవుతుంది.
This post was last modified on December 9, 2024 12:48 pm
https://youtu.be/yCkl2Z3PBs0?si=YrheiH3HjVyB7nwZ పండగ పేరునే టైటిల్ గా పెట్టుకుని బరిలో దిగుతున్న సంక్రాంతికి వస్తున్నాం మీద ముందు ఏమో కానీ పాటలు,…
ప్రతి సంవత్సరం టాలీవుడ్ సంక్రాంతికి ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగుదునమ్మా అంటూ తమిళ డబ్బింగులు రావడం ఏళ్లుగా జరుగుతున్న…
రాష్ట్రానికి సంబంధించి విజన్-2047 ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.. తాజాగా తన సొంత నియోజక వర్గం.. 35 ఏళ్ల నుంచి వరుస…
ఏపీలో కూటమి ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అయితే..ఈ పాపం అంతా వైసీపీ అధినేత,…
గత ఏడాది ది రాజా సాబ్ కు అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీ 2025 ఏప్రిల్ 10. కానీ ఇప్పుడా…
కమర్షియల్ సినిమాలు ఎంతో కొంత రొటీన్ ఫ్లేవర్ కలిగి ఉంటాయి. ఇది సహజం. పైకి కొత్తగా ట్రై చేశామని చెప్పినా…