Movie News

నా బ్రదర్ చిరంజీవికి ఇచ్చేస్తున్నా : బాలయ్య

అభిమానుల మధ్య పొరపొచ్చాలు, అపార్థాలు ఉండొచ్చేమో కానీ టాలీవుడ్ హీరోల సఖ్యత ఎన్నోసార్లు బయటపడిన దాఖలాలు బోలెడున్నాయి. ముఖ్యంగా నిన్నటి తరం లెజెండరీ సీనియర్లు చిరంజీవి, బాలకృష్ణలకు అసలు పడదేమోననే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇటీవలే జరిగిన బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలకు చిరు ముఖ్య అతిథిగా విచ్చేసి మల్టీస్టారర్ తీద్దామని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అంతకు ముందు గౌతమీపుత్ర శాతకర్ణి ప్రమోషన్ సమయంలో ఇండస్ట్రీలో నాకున్న ఏకైక ఫ్రెండ్ చిరంజీవి అంటూ బాలయ్య చెప్పడం వైరలయ్యింది. ఇప్పుడు అన్ స్టాపబుల్ షోలో మరో సందర్భం వచ్చింది.

నవీన్ పోలిశెట్టి, శ్రీలీల గెస్టులుగా పాల్గొన్న తాజా ఎపిసోడ్ లో ఇద్దరి మధ్య బాలయ్య ఒక సరదా ఆట పెట్టారు. ఒక పాట పేరు చెప్పినప్పుడు ఎవరైతే ముందు బజర్ నొక్కి దాని హుక్ స్టెప్ వేస్తారో వారికి ఒక పాయింట్ వస్తుంది. అందులో భాగంగా ముందు అల వైకుంఠపురములో బుట్టబొమ్మ ఇస్తే శ్రీలీల గెలుచుకుంది. తర్వాత ఇంద్ర దాయి దాయి దామ్మ వంతు వచ్చింది. అయితే ఇద్దరూ సరిగా రీ క్రియేట్ చేయలేకపోయారు. దీన్ని గమనించిన బాలయ్య ఈ పాయింట్ మన ముగ్గురికి కాదు నా బ్రదర్ చిరంజీవికి ఇచ్చేస్తున్నా అని చెప్పడంతో ఒక్కసారిగా స్టూడియో చప్పట్లతో మారుమ్రోగిపోయింది.

తర్వాత కుర్చీ మడతపెట్టి, దెబ్బలు పడతాయ్ రోయ్ తదితర సాంగ్స్ తో రౌండ్ కంటిన్యూ అయ్యింది కానీ చిరుకి అలా ప్రత్యేక గౌరవం ఇవ్వడం ఇద్దరి ఫ్యాన్స్ కి నచ్చేసింది. నిజానికి ఎవరో ఒకరికి పాయింట్ ఇచ్చి టాపిక్ ముగిస్తే అయిపోయేది. కానీ అలా చేయలేదు. ఆద్యంతం సరదాగా జరిగిన ఈ టాక్ షోలో నవీన్ పోలిశెట్టి, శ్రీలీల కెరీర్ ప్రారంభంలోని జ్ఞాపకాలు, ఒడిదుడుకులతో పాటు ఎన్నో కబుర్లు పంచుకున్నారు. ఈ జోడి నిజానికి సితార బ్యానర్ లో అనగనగా ఒక రాజు సినిమా చేయాల్సింది. రెండేళ్ల క్రితం ప్రకటన వచ్చాక అర్ధాంతరంగా ఆగిపోయింది. తిరిగి ఈ కాంబో వేరే మూవీకి కలుస్తుందేమో వేచి చూడాలి.

This post was last modified on December 9, 2024 11:11 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

2 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

2 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

2 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

3 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

4 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago