గత ఏడాది ఇదే డిసెంబర్ లో బాక్సాఫీస్ ఊచకోత కోసిన యానిమల్ ని మూవీ లవర్స్ అంత సులభంగా మర్చిపోలేరు. 3 గంటల 21 నిమిషాల మ్యాడ్ నెస్ ని బోర్ కొట్టకుండా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నడిపించిన తీరు తొమ్మిది వందల కోట్లకు పైగా వసూళ్లను తెచ్చి పెట్టింది. టి సిరీస్ సంస్థకు అత్యంత లాభాలు తీసుకొచ్చిన ప్రాజెక్టుగా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ తోనే సందీప్ వంగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ యానిమల్ తనని టాప్ లీగ్ లోకి చేర్చేసింది. దీని క్లైమాక్స్ లో చూపించిన ఎపిసోడ్ త్వరలోనే సీక్వెల్ ఉంటుందని చూపించి యానిమల్ పార్క్ టైటిల్ కూడా ప్రకటించారు.
అయితే రన్బీర్ కపూర్ తాజాగా షాక్ ఇచ్చాడు. ఈ కల్ట్ క్లాసిక్ కేవలం రెండు భాగాలతో ఆగదట. మూడో పార్ట్ కూడా సిద్ధమవుతుందట. అయితే ప్రస్తుతం ఇద్దరికీ ఉన్న కమిట్ మెంట్ల దృష్ట్యా యానిమల్ పార్క్ 2027 కన్నా ముందు మొదలయ్యే ఛాన్స్ లేదని చెప్పాడు. యానిమల్ కింగ్ డం పేరుతో ఇంకోటి వస్తే మాత్రం అరాచకం మాములుగా ఉండదు. ప్రభాస్ స్పిరిట్ పూర్తి చేయడానికి సందీప్ వంగాకు ఎంత లేదన్నా రెండేళ్ల సమయం కావాలి. నెక్స్ట్ టి సిరీసే నిర్మించే అల్లు అర్జున్ మూవీ ఉంది. ఆ తర్వాత యానిమల్ పార్క్ వైపు వెళ్ళాలి. ఇటువైపు రన్బీర్ ఏమో రామాయణ 1 – 2, బ్రహ్మస్త్ర 2, లవ్ అండ్ వార్ తో పాటు ధూమ్ 4కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
మొత్తానికి యానిమల్ ఫ్యాన్స్ కి ఇంత కన్నా గుడ్ న్యూస్ అక్కర్లేదేమో. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ ఫాదర్ సెంటిమెంట్ యాక్షన్ డ్రామాకు కొనసాగింపు అంతకన్నా హింసాత్మకంగా ఉంటుందని చెప్పడంలో అనుమానం లేదు. సినిమాని ఎంటర్ టైన్మెంట్ కోసం చూడండి తప్పించి మెసేజ్ కోసం కాదని ఇటీవలే చెప్పిన సందీప్ వంగా రాబోయే స్పిరిట్ లోనూ మెంటల్ మాస్ చూపిస్తానని ఊరిస్తున్నాడు. హీరోయిజం ఎలివేషన్ ట్రెండ్లో ప్రేక్షకులు ఇలాంటి కంటెంట్ కే ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. యానిమల్ పార్క్ లో రన్బీర్ కపూర్ డ్యూయల్ రోల్ చేసే ఛాన్స్ ఉంది. యానిమల్ చివరిలో క్లూ ఇచ్చింది కూడా అదే.
This post was last modified on December 9, 2024 10:49 am
https://youtu.be/yCkl2Z3PBs0?si=YrheiH3HjVyB7nwZ పండగ పేరునే టైటిల్ గా పెట్టుకుని బరిలో దిగుతున్న సంక్రాంతికి వస్తున్నాం మీద ముందు ఏమో కానీ పాటలు,…
ప్రతి సంవత్సరం టాలీవుడ్ సంక్రాంతికి ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగుదునమ్మా అంటూ తమిళ డబ్బింగులు రావడం ఏళ్లుగా జరుగుతున్న…
రాష్ట్రానికి సంబంధించి విజన్-2047 ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.. తాజాగా తన సొంత నియోజక వర్గం.. 35 ఏళ్ల నుంచి వరుస…
ఏపీలో కూటమి ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అయితే..ఈ పాపం అంతా వైసీపీ అధినేత,…
గత ఏడాది ది రాజా సాబ్ కు అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీ 2025 ఏప్రిల్ 10. కానీ ఇప్పుడా…
కమర్షియల్ సినిమాలు ఎంతో కొంత రొటీన్ ఫ్లేవర్ కలిగి ఉంటాయి. ఇది సహజం. పైకి కొత్తగా ట్రై చేశామని చెప్పినా…