టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడైన సుకుమార్ వ్యక్తిగతంగా కూడా చాలామందికి ఫేవరెట్. ఆయన మాట తీరు, వ్యక్తిత్వం గురించి అందరూ గొప్పగా చెబుతారు. స్టేజ్ మీద సుకుమార్ మాట్లాడేటపుడు కూడా ఆయన ఉన్నత వ్యక్తిత్వం తెలుస్తూనే ఉంటుంది. కానీ ఆయనతో కలిసి పని చేయడం మాత్రం చాలా కష్టం అని అంటారు. తన టీంలో అందరినీ తెగ ఏడిపిస్తారని ఆయనకు పేరుంది. షూటింగ్ బాగా ఆలస్యం చేస్తారు.. ఏదీ ఒక పట్టాన తేల్చరు.. మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. దీని వల్ల ఆయన టీంలో అందరూ ఇబ్బంది పడుతుంటారని చెబుతారు.
ఐతే ఆ సమయానికి ఎంత అసహనం కలిగించినా.. చివరికి బెస్ట్ ఔట్ పుట్ తీసుకొస్తారు కాబట్టి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు సర్దుకుపోతుంటారు. నిర్మాతలు కూడా ఈ కష్టాన్ని భరిస్తారు.సుకుమార్‌తో పని చేసిన చాలామంది చెప్పిన మాట.. ఆయన సెట్లో కూడా సీన్లు, డైలాగులు మారుస్తూ కూర్చుంటారని. ‘పుష్ప’, పుష్ప-2’ చిత్రాల్లో విలన్ పాత్ర పోషించిన ఫాహద్ ఫాజిల్ కూడా ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. తనను తొలిసారి సంప్రదించినపుడే తనకున్న ఈ బలహీనత గురించి సుకుమార్ తనకు స్పష్టంగా చెప్పేసినట్లు ఫాహద్ వెల్లడించాడు.
సుకుమార్ ‘రంగస్థలం’ చూసి తాను చాలా ఇంప్రెస్ అయి.. ‘పుష్ప’ సినిమాకు అడగ్గానే ఒప్పుకున్నట్లు ఫాహద్ వెల్లడించాడు. ఐతే తనకు కథ చెప్పినపుడు.. డైలాగులు, సీన్ల విషయంలో ఫిక్స్ అయిపోవద్దని.. సెట్లో అప్పటికప్పుడు మార్చే అవకాశాలుంటాయని.. మళ్లీ ప్రిపేరవడానికి ఎంత సమయం తీసుకున్నా పర్వాలేదని.. ఇబ్బంది అయితే ఆ రోజు షూట్ ఆపేసినా సర్దుకుంటామని సుకుమార్ తనకు చెప్పినట్లు ఫాహద్ వెల్లడించాడు. సుకుమార్ లాంటి ఫిలిం మేకర్ అంత స్వేచ్ఛ ఇస్తే ఇక ఇబ్బంది ఏముంటుందని ఫాహద్ వ్యాఖ్యానించాడు. ‘పుష్ప’ కోసం ఎర్రచందనం స్మగ్లింగ్ మీద సేకరించిన సమాచారంతో నెట్ ఫ్లిక్స్ కోసం సుకుమార్ ఒక డాక్యుమెంటరీ కూడా చేయాలనుకున్నట్లు ఫాహద్ ఈ సందర్భంగా వెల్లడించాడు.
This post was last modified on December 8, 2024 11:42 pm
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…