‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ చేయబోయే కొత్త సినిమా గురించి మరో పెద్ద అప్‌డేట్ బయటికి వచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేయబోతున్నారు. ఇప్పటికే దీపికా పదుకునే లాంటి బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఈ చిత్రానికి కథానాయికగా ఎంపికైంది. ఇప్పుడు అమితాబ్ వచ్చి చేరడంతో ఈ ప్రాజెక్టు రేంజ్ ఇంకా పెరిగింది. ఇది ట్రూ పాన్ ఇండియా సినిమా కాబోతోందన్నది స్పష్టం.
అమితాబ్ బచ్చన్‌ను పది మంది దర్శకులు సంప్రదిస్తే.. అందులో ఒకటి రెండుకు మించి ఆయన ఎంచుకోరు. ఇప్పటికీ అంత డిమాండ్ ఉందాయనకు. గతంలో నందమూరి బాలకృష్ణ-కృష్ణవంశీ కలయికలో ఓ సినిమాలో ఐదు నిమిషాల పాత్ర కోసం అడిగితే.. డేట్లు ఇవ్వలేకపోయారాయన. ఆయన ఆ పాత్ర చేయలేదని ఆ సినిమానే ఆపేసింది చిత్ర బృందం. దీన్ని బట్టి అమితాబ్ సినిమాల ఎంపికలో ఎంత కచ్చితంగా ఉంటారో తెలిసిందే.
గత ఏడాది చిరంజీవి మీద ఉన్న అభిమానంతో ‘సైరా’ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించిన అమితాబ్.. ఇప్పుడు మాత్రం సినిమా స్కేల్, పాత్ర నచ్చే ప్రభాస్ మూవీని ఓకే చేసి ఉంటాడని భావిస్తున్నారు. ఇంతకీ ఈ సినిమాలో అమితాబ్ పాత్ర ఏమై ఉంటుందన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘ఆదిత్య 369’ తరహా ఫాంటసీ టచ్ ఉన్న సైంటిఫిక్ థ్రిల్లర్ తీయబోతున్నట్లు నాగ్ అశ్విన్ ఇంతకుముందే సంకేతాలు ఇచ్చాడు.
‘ఆదిత్య 369’ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావును ఈ చిత్రానికి మెంటార్‌గా కూడా పెట్టుకున్నారు. ఆయన తయారు చేసిన ‘ఆదిత్య 999’ (369 సీక్వెల్) కథనే కొంచెం మార్చి తీయబోతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒరిజినల్లో టినూ ఆనంద్ పోషించిన సైంటిస్ట్ పాత్రను అమితాబ్ చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అలాంటి పాత్ర అయితే అమితాబ్‌కు భలేగా సెట్టయ్యే అవకాశముంది. చూద్దాం మరి బిగ్-బిని నాగ్ అశ్విన్ ఎలా ఉపయోగించుకుంటాడో?
This post was last modified on October 9, 2020 2:52 pm
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…