మధ్యలో కొన్నేళ్ల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద సినిమాలకు బెనిఫిట్ షోలు లేవు. ఇది స్టార్ హీరోల అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసేది. ఐతే ఈ మధ్య పరిస్థితులు మారాయి. తెలంగాణ, ఏపీల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక బెనిఫిట్ షోలకు అనుమతులు వస్తున్నాయి. అర్ధరాత్రి నుంచే షోలు పడుతున్నాయి. ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ కూడా రెగ్యులర్‌గా చూస్తున్నాం.
ఐతే ఇటీవల పుష్ప-2కు హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్లో ముందు రోజు రాత్రి వేసిన పెయిడ్ ప్రిమియర్‌కు హీరో అల్లు అర్జున్ హాజరు కావడం.. ఆ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుని ఓ మహిళ చనిపోవడంతో విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ప్రకటనతో ఫిలిం ఇండస్ట్రీ వాళ్లతో పాటు సినీ అభిమానులు షాక్ తిన్నారు. ఇది పెద్ద సినిమాల ఓపెనింగ్స్ మీద తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.
ముఖ్యంగా ఇది అగ్ర నిర్మాత దిల్ రాజుకు మింగుడు పడని విషయం.రాబోయే సంక్రాంతికి ఆయన ప్రొడక్షన్ నుంచి గేమ్ చేంజర్, సంక్రాంతికి కలుద్దాం లాంటి క్రేజీ మూవీస్ వస్తున్నాయి. బాలయ్య సినిమా డాకు మహారాజ్‌ను కూడా ఆయనే డిస్ట్రిబ్యూట్ చేయనున్నాడు. సంక్రాంతికి కలుద్దాం సంగతి పక్కన పెడితే మిగతా రెండు చిత్రాలకు పెద్ద ఎత్తున బెనిఫిట్ షోలు వేయాలనుకుంటున్నారు. తెలంగాణలో ఆ షోలు లేవంటే రెవెన్యూ మీద ప్రభావం పడుతుంది.
ఐతే రాజుకు తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో మంచి సంబంధాలున్నాయి. కోమటిరెడ్డి కూడా క్లోజే. అనుకోకుండా ఒక థియేటర్లో నిర్వహణ లోపంతో జరిగిన విషాదాన్ని కారణంగా చూపి మొత్తంగా బెనిఫిట్ షోలను క్యాన్సిల్ చేయడం కరెక్ట్ కాదనే చర్చ నడుస్తోంది. బెనిఫిట్ షో అనే కాక ఏ షోకు అయినా మేనేజ్మెంట్ సరిగా లేకుంటే ఇలా జరుగుతుందని.. ఇకపై అన్ని జాగ్రత్తలు తీసుకునేలా ఎగ్జిబిటర్లకు హెచ్చరికలు జారీ చేయాలని ఇండస్ట్రీ తరఫున ఆలోచిస్తున్నారు. దీని గురించి ప్రభుత్వ పెద్దలకు వివరించి.. ఇకపై ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవని హామీ ఇచ్చి బెనిఫిట్ షోలకు మళ్లీ అనుమతులు లభించేలా చూడాలని రాజుతో పాటు సినీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.
This post was last modified on December 7, 2024 11:04 pm
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…