కాలేజీలో సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేయడం పరిపాటి. ఇది అన్ని చోట్లా ఉన్నదే. అలాగే యాక్టర్స్ మధ్య కూడా ఇలాంటి సరదాలు జరుగుతూ ఉంటాయి. కాకపోతే బయటికి కనిపించవు. అదే టీవీ షోలలో చూపిస్తే అభిమానులకో స్పెషల్ కిక్కు. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో ది రానా దగ్గుబాటి షో పేరుతో సెలబ్రిటీ టాక్ షో మొదలైన సంగతి తెలిసిందే. దీంట్లో పాల్గొనేందుకు క్రేజీ టాలీవుడ్ హీరో హీరోయిన్లను తీసుకొస్తున్నారు. అన్ స్టాపబుల్ తరహాలోనే ఉన్నప్పటికీ దీనికి యూత్ ఫ్లేవర్ బాగా అద్దటంతో యువతను ఆకట్టుకుంటోంది. తాజాగా నాగచైతన్య బావ కోసం ఈ చిట్ చాట్ కొచ్చాడు.
ఇద్దరూ కలిసి లైవ్ లో సాయిపల్లవికి కాల్ చేసి ర్యాగింగ్ చేసినంత పని చేయడం ఆకట్టుకుంది. కొన్ని తెలియని విషయాలు ఈ సందర్భంగా బయట పెట్టేశారు. మాములుగా ఇండస్ట్రీలో సాయిపల్లవి తాను యాక్ట్ చేసిన ఏ సీన్ అయినా, పాటైనా దగ్గరుండి చెక్ చేసుకుని ఏదైనా అవసరమైతే మళ్ళీ రీ షూట్ అడుగుతుందనే టాక్ ఉంది. దాని గురించి రానా నొక్కి అడిగితే అబ్బే అదేం లేదని, వాళ్లే తనను పిలుస్తారు కాబట్టి చూస్తాను తప్పించి నేనేం ఎడిటింగ్ లో తలదూర్చనని క్లారిటీ ఇచ్చింది. రానాతో తను గతంలో విరాట పర్వం చేయగా చైతుతో లవ్ స్టోరీ అయ్యాక ఇప్పుడు తండేల్ చేస్తోంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే సాయిపల్లవికి ఇద్దరి హీరోల్లో చికాకు పెట్టించేది ఎవరంటే చైతునట. ఎలాంటి టెన్షన్ లేకుండా కూల్ గా ఉండటం ఆమెకు కోపం తెప్పిస్తుందట. ట్విస్టు ఏంటంటే దానికి సమాధానం నాగచైతన్యే చెప్పాడు. తన పని కూడా ఆమె చేస్తూ టేక్ అయ్యాక మానిటర్ దగ్గరకు టింగు టింగు మంటూ పరిగెత్తుకొస్తూ ఉంటే తనకు ఆందోళన చెందాల్సిన అవసరం ఏముందని, అంతా సాయిపల్లవినే చూసుకుంటుందని చెప్పడంతో నవ్వులు విరిశాయి. మంచి హ్యూమర్ తో ఆకట్టుకునేలా సాగుతున్న రానా సిరీస్ లో ఇకపై మరింత ఫన్ ఇచ్చే యాక్టర్లయితే రాబోతున్నారు.
This post was last modified on December 7, 2024 10:46 pm
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…
భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…
యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…
నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…
ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…