ఇది క్రెడిట్స్ కోసం పాకులాడే ప్రపంచం. మనం చేయకపోయినా పక్కోళ్ల కష్టాన్ని కూడా ఖాతాలో వేసుకునే జనాలను నిత్యం చూస్తుంటాం. అది రాజకీయం కావొచ్చు, కంపెనీ కావొచ్చు అన్ని చోట్ల ఇలాంటి మనుషులు తగులుతూ ఉంటారు. ఇక సినీ పరిశ్రమ గురించి చెప్పనక్కర్లేదు. ఒకరి కథను తీసేసుకుని డబ్బులు ఇవ్వకుండా స్వంతంగా పేరు వేసుకుని బ్లాక్ బస్టర్లు సాధించిన వాళ్ళను ఎందరినో చూశాం. కానీ ఇంత పెద్ద స్థాయికి వచ్చాక కూడా దర్శకుడు సుకుమార్ తనతో పని చేసిన వాళ్లకు ఇచ్చే గుర్తింపు, విలువ వేరే వాళ్లలో అరుదుగా కనిపిస్తుంది. ఇవాళ పుష్ప 2 ప్రెస్ మీట్ లో మరోసారది బయటపడింది.
ఈ సినిమాకు సగం దర్శకత్వం శ్రీమాన్ చేశాడని, చైల్డ్ హుడ్ ఎపిసోడ్, ట్రక్ ఫైట్, సెకండ్ యూనిట్ పర్యవేక్షణ ఇలా మొత్తం తనే చూసుకున్నాడని ఒకరకంగా చెప్పాలంటే డైరెక్షన్ కింద సుకుమార్ అండ్ శ్రీమాన్ అని వేసుండాల్సిందని సుకుమార్ చాలా పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న మీడియా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే శ్రీమాన్ కు థాంక్స్ చెప్పినా సరిపోయేది. కానీ అన్ని కెమెరాల సాక్షిగా ఇంత ఘనవిజయంలో తన అసిస్టెంట్ కు ఇంత ప్రాధాన్యం ఇవ్వడం చిన్న విషయం కాదు. ఒక్క మాటతో శ్రీమాన్ అనే కొత్త ప్రతిభ టాలీవుడ్ కు పరిచయం కాబోవడం ఖాయం.
మరో అసిస్టెంట్ మధు గురించి కూడా ఇంతే స్థాయిలో పొగడ్తల వర్షం కురిపించారు సుకుమార్. మానిటర్ ముందు తాను ఉంటే వెనుక అతను ఉంటాడని, ఎడిటింగ్ చేస్తే ఎవరూ నో అనలేనంత గొప్పగా ఉంటుందని, రప్పా రప్పా లాంటి ఐడియాలు కూడా తనవే అంటూ కితాబు ఇచ్చాడు. ఇక్కడ లేకపోవడం వల్ల కొట్టాలన్నంత కోపం వస్తోందని స్టేజి మీద తీపి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి ఇంత గొప్పగా తన సహాయకుల గురించి చెప్పడంలో సుకుమార్ మార్క్ మరోసారి బయటపడింది. దేశమంతా బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకుపోతున్న పుష్ప 2 ది రూల్ విజయాన్ని టీమ్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తోంది.
This post was last modified on December 7, 2024 8:20 pm
ఒకప్పుడు ఐటెం సాంగ్స్ అంటే అందుకోసమే కొందరు భామలుండేవారు. వాళ్లే ఆ పాటలు చేసేవారు. కానీ గత దశాబ్ద కాలంలో…
బాలీవుడ్లో విలక్షణ పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించి.. దక్షిణాదిన కూడా కొన్ని సినిమాల్లో నటించింది రాధికా ఆప్టే.. ‘ధోని’, ‘కబాలి’ చిత్రాల్లో నటించిన…
మంచు ఫ్యామిలీ గొడవ గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్గా మారిపోన సంగతి తెలిసిందే. తండ్రీ కొడుకులు.. అన్నదమ్ములు…
"ఈ రోజు నుంచే.. ఈ క్షణం నుంచే నేను రాజకీయాల్లోకి వస్తున్నా.. ఏ పార్టీలో చేరేదీ త్వరలోనే ప్రకటిస్తా. జగన్…
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్కల్యాణ్ సతీమణి, ఇటాలియన్ అన్నాలెజెనోవో తిరుమల…
నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…