సోషల్ మీడియాలో హీరోయిన్లను మార్ఫింగ్ చేయడం, వీడియోలు సృష్టించడం, తద్వారా వ్యూస్ కోసం ఎంతకైనా దిగజారడం గత కొంత కాలంగా చూస్తున్నాం. రష్మిక మందన్న, అలియా భట్ లాంటి వాళ్ళు వీటి బారిన పడిన సందర్భాలున్నాయి. తాజాగా ప్రగ్యా నగారా కూడా చేరింది. ఈమె ఉన్నట్టుగా ప్రొజెక్ట్ చేసిన ఒక అభ్యంతరకర వీడియో ఇటీవలే వైరలయ్యింది. అందులో అభ్యంతకరంగా అనిపించే కంటెంట్ ఉండటంతో వివిధ సామాజిక మాధ్యమాల్లో వెళ్లిపోయింది. ఇది నిజామా కదా అనే నిర్ధారణ లేకుండానే, ఎవరు సృష్టించారో తెలియకుండానే లక్షలాది మందికి గంటల నిడివిలో చేరింది .
ప్రగ్యకు ఇన్‌స్టాగ్రామ్ లో 1.1 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. తమిళంలో 2022 వరలరు ముక్కియంతో డెబ్యూ చేసింది. మరుసటి ఏడాది నాదికలిల్ సుందరి యమునాతో మల్లువుడ్ లో అడుగు పెట్టింది. ఇటీవలే రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో వచ్చిన లగ్గం ద్వారా తెలుగు స్ట్రెయిట్ మూవీ చేసింది. సాయి రోనక్ హీరోగా నటించాడు. థియేటర్లో ఆశించిన ఫలితం అందుకోనప్పటికీ ఆహా ఓటిటిలో వచ్చాక వ్యూస్ భారీగా వచ్చాయి. హర్యానా రాష్ట్రానికి చెందిన ప్రగ్యా స్వస్థలం అంబాల. తండ్రి ఇండియా ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉద్యోగి. చెన్నైలో ఉండటం వల్ల దక్షిణాది సంస్కృతి అలవాట్లు అలవడ్డాయి.
ప్రగ్యా ఎక్స్ వేదికగా దీని గురించి స్పందిస్తూ ఈ ఘటన తనను షాక్ కు గురి చేసిందని, ఒక పీడకలగా భయపెట్టిందని, సాంకేతికత ఇలాంటి వాటికి పురికొల్పడం విచారకరమని పేర్కొంది. ఈ అవమానం మరే మహిళకు జరగకూడదని ట్వీట్ చేసింది. ఏఐ టెక్నాలజీ వచ్చాక డీప్ ఫేక్ వీడియోస్ బాగా ఎక్కువయ్యాయి. రష్మికది వివాదం అయ్యాక ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవడంతో మళ్ళీ అలాంటివి కనిపించలేదు. మూలాలు ఎక్కడో, ఎవరు సృష్టించారో కనిపెట్టే సమయానికి ఇలాంటి వీడియోలు చాలా దూరం వెళ్లిపోయాయి. చట్టంలో శిక్షలు తీవ్రంగా ఉంటే తప్ప వీటిని అడ్డుకోవడం కష్టం.
This post was last modified on December 7, 2024 5:14 pm
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…