ఏపీ తెలంగాణ మాత్రమే కాదు అంతకు రెండింతలు ఉత్తరాది రాష్ట్రాల్లో పుష్ప 2 ది రూల్ ఆడుతున్న వీరంగం మాములుగా లేదు. హిట్టవ్వడం అందరూ ఊహించిందే కానీ ఇంత భీభత్సమైన బాలీవుడ్ రెస్పాన్స్ మాత్రం ఊహకందనిది. హైదరాబాద్ ని మించి ముంబై, కోల్కతా లాంటి నగరాల్లో థియేటర్ల దగ్గర జన సందోహం చూస్తుంటే నిజంగా ఇది డబ్బింగ్ సినిమానా అనే అనుమానం కలగక మానదు. డిసెంబర్ 5 బాక్సాఫీస్ వద్ద పుష్ప 2కి భయపడి ఎవరూ రాకపోవడం ఆయా నిర్మాతలకు మేలే చేసింది. కట్ చేస్తే డిసెంబర్ 13న సిద్ధూ మిస్ యుతో పలకరించబోతున్నాడు. ఆల్రెడీ ఒక వారం వాయిదా పడి ఈ డేట్ ఫిక్స్ చేసుకుంది.
సరే బాగానే ఉంది కానీ అల్లు అర్జున్ సునామిని సిద్దు తట్టుకోగలడా అనేదే పెద్ద అనుమానం. ఎందుకంటే మిస్ యు మీద పెద్ద బజ్ లేదు. ట్రైలర్ కాసింత ఆసక్తి రేపినప్పటికీ ఖచ్చితంగా చూసే తీరాలన్న ఇంప్రెషన్ ఇవ్వలేదు. అయినా సరే మౌత్ టాక్ ని నమ్ముకుని టీమ్ ధైర్యం చేస్తోంది. వచ్చే వారం నుంచి చాలా ప్రాంతాల్లో పుష్ప 2 టికెట్ రేట్లు సాధారణ స్థితికి రాబోతున్నాయి. అప్పుడు సగటు మాస్ ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియన్స్ బయటికి వస్తారు. వాళ్ళ ఫస్ట్ ఛాయస్ పుష్ప 2నే అవుతుంది. పైగా రిపీట్స్ వేస్తున్న జనాల సంఖ్య మాములుగా లేదు. సో ఈ తుఫాను రెండో వారం కొనసాగడం ఖాయం.
అలాంటప్పుడు ఎంత మంచి కంటెంట్ ఉన్నా మిస్ యు కి పెను సవాలే ఎదురు కాబోతోంది. అయితే ప్రస్తుతం ఇంతకన్నా ఆప్షన్ లేదు. ఎందుకంటే డిసెంబర్ 20 విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 2, ఉపేంద్ర యుఐ, అల్లరి నరేష్ బచ్చల మల్లి, మహేష్ బాబు డబ్బింగ్ చెప్పిన ముఫాసా లయన్ కింగ్ దిగుతున్నాయి. డిసెంబర్ 25 నితిన్ రాబిన్ హుడ్ తో వస్తాడు. ఇవి కాకుండా మరో అయిదారు మీడియం బడ్జెట్ రిలీజులున్నాయి. సో చావో రేవో సిద్దార్థ్ కి ఇప్పుడు రావడం మినహా మరో మార్గం లేదు. నా సామిరంగా ఫేమ్ ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా నటించిన మిస్ యులో లవ్, రొమాన్స్ తో పాటు యాక్షన్ కూడా దట్టించారు.
This post was last modified on December 7, 2024 11:31 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…