‘పుష్ప: ది రూల్’ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో విడుదల ముంగిట ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. కొన్ని సన్నివేశాలకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం నచ్చక.. వేరే ముగ్గురు సంగీత దర్శకులను ఆశ్రయించాడు దర్శకుడు సుకుమార్. తమన్‌తో పాటు తమిళ సంగీత దర్శకుడు సామ్ సీఎస్, కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్‌లకు కొన్ని ఎపిసోడ్లు ఇచ్చి బీజీఎం చేసి ఇవ్వమన్నారు.
ముగ్గురూ ఆ బాధ్యత పూర్తి చేసి బీజీఎం ట్రాక్స్ పుష్ప టీంకు అప్పగించారు. ఐతే ఇందులో తమన్ వర్క్ అస్సలు నచ్చని సుకుమార్.. దాన్ని పూర్తిగా పక్కన పెట్టేశాడు. అజనీష్ వర్క్ కొంత నచ్చినా సరే.. సినిమాలో వాడలేని పరిస్థితి వచ్చింది. సామ్ సీఎస్ వర్క్‌కు మాత్రం ఇంప్రెస్ అయి.. దాన్ని సినిమాలో పెట్టారు. కానీ తన వర్క్ కూడా మొత్తం తీసుకోలేదు. ‘పుష్ప-2’కు 90 శాతం బీజీఎం తన క్రెడిట్టే అని సామ్ చెబుతున్నాడు కానీ.. అది వాస్తవం కాదన్నది టీం వర్గాల సమాచారం.
మొత్తంగా సినిమాలో ఓ పది నిమిషాల సమయం మాత్రమే సామ్ నేపథ్య సంగీతం వినిపించింది. పుష్ప పాత్రకు మంచి ఎలివేషన్ పడ్డ పోలీస్ స్టేషన్ ఎపిసోడ్లో వినిపించిందంతా సామ్ బీజీఎంయే. ఇంకా అక్కడక్కడా చిన్న చిన్న బిట్లుగా తన వర్క్ వాడారు. క్లైమాక్సులో దేవి, సామ్‌ల్లో ఎవరి బీజీఎం వాడాలనే విషయంలో చాలా చర్చ జరిగినప్పటికీ.. చివరికి దేవికే ఓటేశాడు సుకుమార్. ఇదీ టీం నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం.
ఇదిలా ఉంటే దేవిశ్రీకి సంగీతం, నేపథ్య సంగీతానికి కలిపి ఇచ్చిన పారితోషకానికి తోడు.. బీజీఎం కోసం నిర్మాతలు అదనంగా పెట్టిన ఖర్చు రూ.3 కోట్లు కావడం గమనార్హం. తమన్, అజనీష్, సామ్‌లు ముగ్గురికీ తలో కోటి సమర్పించుకున్నారు. మిగతా ఇద్దరి ట్రాక్స్ అసలు వాడనే లేదు. సామ్‌ది మాత్రం కొంత ఉపయోగించారు. అది పది నిమిషాల నిడివి మాత్రమే. అంటే ఈ పది నిమిషాల అదనపు స్కోర్ కోసం ఏకంగా రూ.3 కోట్లు పెట్టారన్నమాట.
This post was last modified on December 6, 2024 11:52 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…