పుష్ప-2 సినిమాకు తాను సంగీత దర్శకుడిగా ఉండగా.. ఇంకో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లను బీజీఎం కోసం తీసుకోవడం పట్ల దేవిశ్రీ ప్రసాద్ ఎంత హర్టయ్యాడో రిలీజ్ ముంగిట చెన్నైలో జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్లో స్పష్టంగా తెలిసిపోయింది. ఐతే సినిమాలో చాలా వరకు తన బీజీఎంయే వాడడంతో అతను చివరికి కామ్ అయ్యాడు. ఇలా ఒకరి సినిమాలోకి ఇంకొకరు రావడాన్ని దేవి ముందు నుంచి వ్యతిరేకిస్తూనే ఉండడం గమనార్హం. గతంలో ‘అతడు’ సినిమాకు మణిశర్మను ఓసారి అనుకున్నాక తనను అడిగితే.. తాను నో చెప్పినట్లు ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు దేవి.
‘ఇంద్ర’లో ఓ పాటకు తనను అడిగినా కూడా అలా చేయడం కుదరదనే చెప్పినట్లు కూడా ఆ సందర్భంలో వెల్లడించాడు. తాజాగా మరో ఇంటర్వ్యూలో ఓ స్టార్ హీరో తన కోసం పట్టుబడ్డప్పటికీ తనకున్న ఎథిక్స్ వల్ల ఆ సినిమా చేయలేదని దేవి వెల్లడించాడు. తమిళ స్టార్ హీరో విక్రమ్‌తో ఏఎల్ విజయ్ చేయాల్సిన ఓ సినిమా కోసం తాను సంగీతం అందించాల్సిందని దేవి చెప్పాడు. తననే సంగీత దర్శకుడిగా తీసుకోవాలని విక్రమ్ పట్టుబట్టినట్లు తెలిపాడు.
ఐతే అప్పటిదాకా జీవీ ప్రకాష్ కుమార్.. విజయ్ సినిమాలకు వరుసగా పని చేస్తున్నాడని.. విక్రమ్‌తో చేయాల్సిన సినిమా కథను కూడా వాళ్లిద్దరూ చర్చించుకున్నారని.. జీవీతోనే మళ్లీ పని చేయాలని విజయ్ అనుకున్నాడని.. ఈ విషయం తెలిసి తాను అతడితోనే కొనసాగమని విజయ్‌కి చెప్పినట్లు దేవి చెప్పాడు. తర్వాత విక్రమ్‌కు ఫోన్ చేసి మాట్లాడానని.. విజయ్‌కి జీవీతోనే కంఫర్ట్ అని, తనతోనే కొనసాగనివ్వాలని చెబితే విక్రమ్ ఆశ్చర్యపోయాడని.. ఇలా ఒక సంగీత దర్శకుడికి ఆఫర్ ఇస్తుంటే వేరే మ్యూజిక్ డైరెక్టర్‌తోనే వెళ్లమని చెప్పడం గొప్ప విషయమని.. ఈ సంస్కారం వల్ల నువ్వు చాలా ఎత్తుకు ఎదుగుతావు అని విక్రమ్ చెప్పాడని దేవి వెల్లడించాడు. విక్రమ్, విజయ్ కాంబినేషన్లో నాన్న, తాండవం చిత్రాలు వచ్చాయి. వీటిలో ఏదో ఒక సినిమా గురించే దేవి మాట్లాడి ఉండొచ్చు.
This post was last modified on December 6, 2024 11:41 pm
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…