Movie News

ఫాహద్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు పుష్పా…

గత దశాబ్ద కాలంలో ఇండియాలో అత్యుత్తమ నటుల్లో ఒకడిగా ఎదిగిన ఆర్టిస్ట్.. ఫాహద్ ఫాజిల్. లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ తనయుడైన ఫాహద్.. ముందు మామూలు సినిమాలే చేశాడు. ‘బెంగళూరు డేస్’ లాంటి పెద్ద హిట్టయిన సినిమాలో కూడా అతడి క్యారెక్టర్, నటన సింపుల్‌గానే అనిపిస్తాయి. కానీ తర్వాత ‘కుంబలంగి నైట్స్’ లాంటి చిత్రాల్లో అతను నటుడిగా విజృంభించాడు. ఇక గత ఐదారేళ్లలో ఫాహద్ చేసిన సినిమాలు, పాత్రల గురించి ఎంత చెప్పినా తక్కువే.

కేవలం అతడి నటన చూడ్డానికే ఎంతోమంది థియేటర్లకు వెళ్తారు. తన మాతృభాష మలయాళంలోనే కాక వేరే భాషల్లోనూ అద్భుతమైన పాత్రలతో మెప్పించాడు ఫాహద్. తెలుగులో కూడా తన డెబ్యూ మూవీ ‘పుష్ప’ తన ప్రత్యేకతను చాటి చెప్పింది. అందులో మిగతా సినిమా అంతా ఒకెత్తయితే.. ఫాహద్ కనిపించే చివరి 20 నిమిషాలు మరో ఎత్తు. సినిమాను వేరే స్థాయికి తీసుకెళ్లడంలో ఫాహద్ పాత్ర, తన నటన కీలక పాత్ర పోషించాయి.‘పుష్ప-1’లో ఫాహద్ పాత్రను పరిచయం చేసిన తీరు చూసి.. రెండో భాగంలో అతడి పాత్ర వేరే లెవెల్లో ఉంటుందని, పెర్ఫామెన్స్ అదిరిపోతుందని అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు.

కానీ తీరా సినిమా చూసిన దగ్గర్నుంచి అందరూ పెదవి విరుస్తున్నారు. హీరోను విపరీతంగా ఎలివేట్ చేయడమే పనిగా పెట్టుకున్న సుకుమార్.. మిగతా పాత్రల మీద పెద్దగా ఫోకస్ చేయలేదని.. విలన్ పాత్రలు వీకైపోవడం మైనస్ అయిందని మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఫాహద్ పాత్ర మొదట్లో బాగానే అనిపించినా.. రాను రాను వీక్ అయిపోయిందని.. చివరికి అతనొక జోకర్ లాగా తయారయ్యాడని అంటున్నారు.

ఇంటర్వెల్ ముంగిట పుష్ప-షెకావత్ ఫేసాఫ్ చూసి ఎంతో ఊహించుకుంటే.. ద్వితీయార్ధంలో వారి మధ్య పోరు హోరాహోరీగా సాగలేదని.. హీరో ముందు విలన్ పాత్ర డంగైపోయిందని.. ఫాహద్ పాత్రను ముగించిన తీరు కూడా అంత బాగా లేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. విలన్ పాత్ర ఎంత బాగుంటే హీరో పాత్ర అంత ఎలివేట్ అవుతుందని సుకుమార్‌కు తెలియంది కాదని.. అయినా ఆయన ఈ విషయాన్ని విస్మరించారని ఫాహద్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on December 6, 2024 7:24 pm

Share

Recent Posts

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

2 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

4 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

5 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

5 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

6 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

6 hours ago