ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజా సాబ్ ఏప్రిల్ 10 విడుదల కావడం లేదన్న ఊహాగానాలు ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా తిరుగుతున్నాయి. ఇంకా అయిదు నెలల సమయం ఉన్నప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్, విఎఫెక్స్ పనులు బోలెడు ఉండటంతో అప్పటికంతా పూర్తవ్వడం డౌట్ అంటున్నారు. అందుకే ఇదే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న మరో ప్యాన్ ఇండియా మూవీ మిరాయ్ రిలీజ్ ఏప్రిల్ 18 నుంచి వాయిదా వేయడం లేదన్న కామెంట్లకు బలం చేకూరుతోంది. అయితే ఇది నిజమా కాదా అనేది నిర్ధారణ కాలేదు కానీ పోస్ట్ పోన్ గురించి లీకైతే మాత్రం విశ్వసనీయంగా ఉంది.
ఒకవేళ ఇది కనక జరిగితే విశ్వంభరని దించే ఆలోచనలో యువి క్రియేషన్స్ సీరియస్ గా ఉందట. ఇప్పటికే షూట్ దాదాపు పూర్తి కావొస్తుంది. టీజర్ కొచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని దృష్టిలో ఉంచుకుని గ్రాఫిక్స్ మీద మళ్ళీ వర్క్ చేస్తున్నట్టు సమాచారం. దీన్ని ఫిబ్రవరిలోగా కొలిక్కి తేవాలని యువి టీమ్ లక్ష్యంగా పెట్టుకుందట. ఏదో ఒక నిర్ణయం సంక్రాంతి లోగా తీసుకుని పండగకు మొదటి లిరికల్ సాంగ్ వదిలితే ఎలా ఉంటుందన్న ప్రతిపాదన పరిశీలనలో ఉందని తెలిసింది. ఉన్న బజ్ తగ్గిపోయిన నేపథ్యంలో ప్రమోషన్ల పరంగా విశ్వంభరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమాలు చెప్పిన డేట్లకు రాలేని పరిస్థితులు క్రమంగా పెరుగుతున్నాయి. కనీసం రెండు మూడు తేదీలు మారకుండా ఎవరూ లేరు. మరి రాజా సాబ్ అదే రూటు పడుతుందా అనేది ప్రొడక్షన్ హౌస్ మీద ఆధారపడి ఉంటుంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించిన ఈ హారర్ డ్రామాకు తమన్ సంగీతం సమకూర్చాడు. ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద చూడని అతి పెద్ద హారర్ గ్రాండియర్ ఇవ్వబోతున్నట్టు నిర్మాత టిజి విశ్వప్రసాద్ ప్రకటించాక అంచనాలు పెరిగాయి. మరి ఏప్రిల్ 10 రాజా సాబ్ వస్తాడో లేక విశ్వంభర ఆగమిస్తాడో చూద్దాం.
This post was last modified on December 6, 2024 7:20 pm
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…