మొత్తానికి భారతీయ ప్రేక్షకులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన సినిమా రానే వచ్చింది. ‘పుష్ప: ది రూల్’ గురువారమే థియేటర్లలోకి దిగింది. ముందు రోజు రాత్రి నుంచే ‘పుష్ప-2’ హంగామా మొదలైపోయింది. తొలి రోజు ఇండియాలోనే కాక ఇతర దేశాల్లో కూడా హౌస్ ఫుల్ వసూళ్లతో సాగిన ఈ చిత్రం రెండో రోజులోకి అడుగు పెట్టింది. సినిమాకు ఉన్న హైప్, వైడ్ రిలీజ్, టికెట్ల ధరలు, అడ్వాన్స్ బుకింగ్స్.. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని చూస్తే ‘పుష్ప-2’ వసూళ్ల పరంగా కొత్త రికార్డులు నెలకొల్పడం ఖాయంగా కనిపించింది.
ఆ అంచనాలకు తగ్గట్లే ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులన్నీ ఈ సినిమా బద్దలు కొట్టేసింది. ఏకంగా రూ.280 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో ‘ఆర్ఆర్ఆర్’ పేరిట ఉన్న అత్యధిక తొలి రోజు వసూళ్ల రికార్డును ‘పుష్ప-2’ బద్దలు కొట్టేసింది. పుష్ప-2కు ఉన్న హైప్‌తో పాటు మిగతా అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని చూస్తే ఇదేమీ ఆశ్చర్యపరిచే విషయం కాదు. దీన్ని మించిన విశేషం ఇంకోటి ఉంది.హిందీలో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగానూ ‘పుష్ప-2’ నిలవడం విశేషం.
షారుఖ్ ఖాన్ మూవీ ‘జవాన్’ గత ఏడాది రూ.64 కోట్ల నెట్ వసూళ్లతో ఇండియాలో డే-1 అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ రికార్డును ఒక సౌత్ మూవీ బద్దలు కొట్టడం అంటే చిన్న విషయం కాదు. ‘పుష్ప-2’ హిందీ వెర్షన్ తొలి రోజు ఇండియాలో రూ.67 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. ‘పుష్ప-1’ రిలీజైనపుడు మొదట హిందీలో నామమాత్రంగా రిలీజవుతున్నట్లే అనిపించింది. రిలీజ్ ముంగిట ఏమాత్రం హైప్ లేదు. కానీ విడుదల తర్వాత కథ మారిపోయింది. ఈ సినిమా కోసం హిందీ ఆడియన్స్ ఎగబడ్డారు.
ఫుల్ రన్లో రూ.80 కోట్ల దాకా వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. ఐతే ఇప్పుడు పుష్ప-2 హిందీ వెర్షన్ తొలి రోజే రూ.67 కోట్ల నెట్ కలెక్షన్లతో బాలీవుడ్‌కు పెద్ద షాకే ఇచ్చింది. హిందీలో ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ రివ్యూలు రావడం, అక్కడి ప్రేక్షకులు కూడా సినిమా చూసి ఊగిపోతుండడంతో ఫుల్ రన్లో రూ.400-500 కోట్ల మధ్య కలెక్షన్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు.
This post was last modified on December 6, 2024 3:10 pm
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…