యశోద సమయంలో తీవ్ర అనారోగ్యంతో బాధ పడిన హీరోయిన్ సమంత ఆ తర్వాత శాకుంతలం, ఖుషి ప్రమోషన్లకు సైతం ఇబ్బంది పడుతూ పాల్గొంది. ఒకదశలో షూటింగులే వద్దనుకుని చికిత్స కోసం తగినంత సమయం తీసుకుని రాజ్ అండ్ డికె ప్రోత్సహించడం వల్లే సిటాడెల్ హానీ బన్నీ చేసింది. ప్రస్తుతం ఎవరికి కొత్తగా కమిట్ మెంట్లు ఇవ్వకుండా సొంత బ్యానర్ మీద మా ఇంటి బంగారం ప్రాజెక్టుని కొన్ని నెలల క్రితం అనౌన్స్ చేసింది. క్యాస్టింగ్, దర్శకుడు, సాంకేతిక వర్గం ఇతర వివరాలు ఇంకా చెప్పలేదు. తాజాగా తన ఆరోగ్యం గురించి నిర్మాత బెల్లంకొండ సురేష్ చెప్పిన కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
పాతిక సంవత్సరాల ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన వెల్లడి చేసిన విషయాల్లో సమంతా ప్రస్తావన వచ్చింది. అదేంటో చూద్దాం. అల్లుడు శీను టైంలోనే సామ్ కు చర్మానికి సంబంధించిన జబ్బొకటి బయట పడింది. త్వరగా కోలుకునే అవకాశం ఉన్నప్పటికీ అప్పుడున్న పరిస్థితుల వల్ల వేరే నిర్మాతలు స్పందించకపోతే బెల్లంకొండ సురేషే పాతిక లక్షలు పంపారు. అంతే కాకుండా పార్క్ హయత్ లో ఒక సింగల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ తీసిచ్చి వసతితో పాటు ఇంటి నుంచి క్యారియర్ వెళ్లేలా చేశారు. ఆ కృతజ్ఞత సురేష్ పట్ల సమంతకు ఇప్పటికీ ఉండటం వల్ల వీళ్ళ ఫ్యామిలీని కలుస్తూ ఉంటుంది.
అయితే రెండేళ్ల క్రితం వచ్చిన వ్యాధి వేరేనట. చూస్తుంటే సామ్ బయటికి చెప్పని చేదు విషయాలు చాలా ఉన్నాయన్న మాట. అల్లుడు శీను అంటే అప్పటికి తన కెరీర్ ఇంకా ప్రారంభంలో ఉంది. స్టార్ హీరోలతో జోడి కడుతున్న టైంలో ఇంత బాధను అనుభవించి సినిమాలు చేయడమంటే గ్రేటే. సిటాడెల్ హనీ బన్నీ ఆశించిన ఫలితం అందుకోకపోవడం ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. దీని కోసం సమంతా చాలా కష్టపడింది. నెలల తరబడి ఫైట్లలో శిక్షణ తీసుకోవడమే కాక రిస్కీ స్టంట్స్ చేసింది. కానీ ది ఫ్యామిలీ మ్యాన్ స్థాయిలో బ్లాక్ బస్టర్ కాలేకపోయింది. ప్రస్తుతం తుంబాడ్ సృష్టికర్తలు రక్త్ బ్రహ్మాండ్ లో నటిస్తోంది.
This post was last modified on December 6, 2024 11:18 am
https://youtu.be/yCkl2Z3PBs0?si=YrheiH3HjVyB7nwZ పండగ పేరునే టైటిల్ గా పెట్టుకుని బరిలో దిగుతున్న సంక్రాంతికి వస్తున్నాం మీద ముందు ఏమో కానీ పాటలు,…
ప్రతి సంవత్సరం టాలీవుడ్ సంక్రాంతికి ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగుదునమ్మా అంటూ తమిళ డబ్బింగులు రావడం ఏళ్లుగా జరుగుతున్న…
రాష్ట్రానికి సంబంధించి విజన్-2047 ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.. తాజాగా తన సొంత నియోజక వర్గం.. 35 ఏళ్ల నుంచి వరుస…
ఏపీలో కూటమి ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అయితే..ఈ పాపం అంతా వైసీపీ అధినేత,…
గత ఏడాది ది రాజా సాబ్ కు అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీ 2025 ఏప్రిల్ 10. కానీ ఇప్పుడా…
కమర్షియల్ సినిమాలు ఎంతో కొంత రొటీన్ ఫ్లేవర్ కలిగి ఉంటాయి. ఇది సహజం. పైకి కొత్తగా ట్రై చేశామని చెప్పినా…