సెలబ్రెటీల సాయంతో నేరాలు, ఘోరాలపై జనాల్లో అవగాహన పెంచే కార్యక్రమాల్ని హైదరాబాద్ పోలీసులు తరచుగా చేపడుతున్నారు. ఇందుకోసం టాలీవుడ్లో ఇప్పటికే పలువురు సెలబ్రెటీల సాయం తీసుకున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఓ మంచి పని కోసం హైదరాబాద్ పోలీసులతో చేతులు కలిపాడు. ఆన్ లైన్‌లో అపరిచితులతో స్నేహం చేయడం ఎంత ప్రమాదమో వివరిస్తూ తారక్ ఒక వీడియో చేశాడు. తారక్ వ్యాఖ్యానం కంటే ముందు ఇందులో ఒక వీడియో చూపించారు.
ఒక అమ్మాయి తన గదిలో ఏడుస్తూ ఉంటే తన స్నేహితురాలు వచ్చి ఏమైందని అడుగుతుంది. ఫేస్ బుక్‌లో ఒక అబ్బాయితో పరిచయం జరగడం.. ఆ తర్వాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడం.. అతను ప్రపోజ్ చేయగా.. ఆ అమ్మాయి ఓకే చెప్పడం.. తర్వాత ఆ అమ్మాయి నగ్న చిత్రాలు అడిగితే ఆమె పంపడం.. వాటిని పెట్టుకుని అతను ఆ అమ్మాయిని బ్లాక్‌మెయిల్ చేయడం.. ఆ అమ్మాయి తీవ్ర మానసిక వేదనకు గురి కావడం.. ఇలా సాగుతుందా వీడియో.
ఇది ముగిశాక ఆన్ లైన్ స్నేహాలతో జాగ్రత్తగా ఉండాలని.. వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని.. అపరిచిత వ్యక్తులతో సన్నిహితంగా ఉండొద్దని.. అప్రమత్తంగా ఉండాలని తారక్ హితవు పలికాడు. హైదరాబాద్ సైబర్ పోలీసులు ఈ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇంతకుముందు రాఖీ, టెంపర్ లాంటి సినిమాల్లో అమ్మాయిలకు అండగా నిలిచే అన్నయ్య పాత్రలతో తారక్ ఆకట్టుకున్నాడు.
ఈ నేపథ్యంలో అమ్మాయిలు ఈజీగా కనెక్టవుతారని అతడితో ఈ వీడియో చేయించినట్లున్నారు పోలీసులు. లాక్ డౌన్ టైంలో ఎక్కడా పెద్దగా కనిపించని తారక్.. తన లేటెస్ట్ లుక్‌తో ఈ వీడియోలో కనిపించడం అభిమానులను ఆనందపరిచింది. ఈ నెల 22న ‘ఆర్ఆర్ఆర్’లో తారక్ చేస్తున్న కొమరం భీమ్ పాత్రకు సంబంధించిన టీజర్ రిలీజవబోతున్న నేపథ్యంలో అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు.
This post was last modified on October 9, 2020 8:44 am
జిమ్ జిమ్ తార.. గత నాలుగైదు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో…
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)లో 73 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇది జరిగి…
ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…
మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా రూపొందించిన ‘రావు బహదూర్’ సినిమా మీద టీం అంతా చాలా…
తమ సినిమాలు థియేటర్లలో ఉండగా అందులో లోపాల గురించి.. దాని మీద వచ్చే విమర్శల గురించి, కలెక్షన్లు తక్కువ రావడం…
21 ఏళ్ల కెరీర్‌లో అర్జెంటీనా కోసం ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో మార్చిన లియోనెల్ మెస్సీ.. చివరి మ్యాచ్‌లోనూ తన మార్క్…