ఇప్పుడు భాషల మధ్య పూర్తిగా హద్దులు చెరిగిపోయి అన్ని భాషల చిత్రాలూ అన్ని చోట్లా ఆడేస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కూడా వేర్వేరు భాషలకు వెళ్లి సినిమాలు చేస్తున్నారు. ఒక భాషలో రాబోతున్న పెద్ద సినిమాలో వేరే భాషకు చెందిన నటుడిని నటింపజేస్తే దాన్ని విశేషంగా చెప్పుకునేవాళ్లు ఒకప్పుడు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. తెలుగులోకి చాలామంది పరభాషా నటులు వస్తున్నారు. మన ఆర్టిస్టులూ వేరే భాషలకు వెళ్తున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘కూలీ’లో అక్కినేని నాగార్జున నటిస్తుండడం అమితాసక్తిని రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కన్నడ నుంచి ఉపేంద్ర, మలయాళం నుంచి సోబిన్ షాహిర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ప్రాజెక్టులోకి మరో టాలీవుడ్ నటుడు వచ్చినట్లు సమాచారం. అతనే.. సందీప్ కిషన్.‘కూలీ’లో ఇప్పటికే ప్రత్యేక పాత్రలు చాలా ఉన్నాయి. వీటికి సందీప్ క్యారెక్టర్ కూడా తోడవుతున్నట్లు కోలీవుడ్ సమాచారం.
విశేషం ఏంటంటే.. ‘కూలీ’ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తొలి చిత్రంలో సందీపే హీరోగా నటించాడు. వీరి కలయికలో వచ్చిన ‘మానగరం’ తమిళంలో పెద్ద హిట్టయింది. లోకేష్‌కు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ‘ఖైదీ’తో అతడి కెరీరే మారిపోయింది. ఆపై మాస్టర్, విక్రమ్, లియో లాంటి భారీ చిత్రాలు తీసిన అతను.. ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ‘కూలీ’ తీస్తున్నాడు. ఇప్పుడు కూడా సందీప్‌ను గుర్తుంచుకుని తనకో స్పెషల్ రోల్ ఇవ్వడం విశేషమే.
ఐతే ‘కూలీ’లో స్పెషల్ రోల్స్, క్యామియోస్ ఎక్కువ అయిపోతున్నాయనే అభిప్రాయం గురించి ఇంతకుముందు లోకేష్ స్పందిస్తూ.. ఆకర్షణ పెంచడానికి ఇవన్నీ చేయట్లేదని.. రజినీ సినిమాకు ఆ అవసరం లేదని.. ప్రతి పాత్రలో ఒక విశేషం ఉంటందని, అన్నీ కథలో భాగంగానే ఉంటాయని చెప్పాడు. మరి సందీప్ ఇందులో అంత ప్రత్యేకమైన పాత్ర ఏం చేస్తున్నాడో చూడాలి.
This post was last modified on December 5, 2024 8:40 pm
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…