గత పది పదిహేనేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో వందల కొద్దీ కొత్తగా మల్టీప్లెక్స్ స్క్రీన్లు వచ్చాయి. చిన్న చిన్న పట్టణాల్లో కూడా మల్టీప్లెక్సులు చూస్తున్నాం. ఐతే తెలుగు రాష్ట్రాలకు తొలిసారిగా మల్టీప్లెక్స్ వినోదాన్ని పరిచయం చేసిన ఘనత ప్రసాద్స్‌కే దక్కుతుంది. హైదరాబాద్‌కు పర్యాటకులు వస్తే కచ్చితంగా సందర్శించాల్సిన మాన్యుమెంట్ లాగా మారింది ప్రసాద్స్. నగరంలో పదుల సంఖ్యలో మల్టీప్లెక్సులు వచ్చినా.. ప్రసాద్స్ ప్రత్యేకత ప్రసాద్స్‌దే. కొత్త సినిమాకు ఫస్ట్ షో అక్కడే పడాలి.
ఫిలిం సెలబ్రెటీలు, మీడియాతో పాటు రెగ్యులర్ ఫిలిం గోయర్స్ అంతా అక్కడే సినిమా చూడాలి. అలాంటి కల్ట్ స్టేటస్ సంపాదించుకుంది ప్రసాద్స్. అలాంటి స్పెషల్ మల్టీప్లెక్సులో ‘పుష్ప-2’ లాంటి భారీ సినిమా ప్రదర్శనకు నోచుకోని పరిస్థితి తలెత్తడం హైదరాబాద్ సినీ ప్రియులను షాక్‌కు గురి చేస్తోంది. రెవెన్యూ షేరింగ్ విషయంలో ‘పుష్ప-2’ నిర్మాతలకు, ప్రసాద్స్ యాజమాన్యానికి మధ్య తలెత్తిన వివాదం వల్ల.. బుధవారం 9 గంటల ప్రాంతంలో కూడా ప్రసాద్స్‌లో ‘పుష్ప-2’ ఒక్క షోకు కూడా బుకింగ్ మొదలు కాలేదు.
గురువారం నుంచి ఏ రోజుకూ అడ్వాన్స్ బుకింగ్స్ లేవు. ‘పుష్ప-2’ కోసమని అన్ని స్క్రీన్లనూ అట్టి పెట్టుకుని ఉన్నారు కానీ.. ఈ వివాదం ఎంతకీ తేలకపోవడంతో బుకింగ్సే ఓపెన్ కాలేదు. మామూలుగా అయితే ముందు రోజు 9.30కి షెడ్యూల్ చేసిన పెయిడ్ ప్రిమియర్స్ ప్రసాద్స్‌లో కచ్చితంగా పడేవి. కానీ ఈ వివాదం వల్ల ప్రసాద్స్ బోసిపోయి ఉంది. ఇంత పెద్ద సినిమా రిలీజవుతుంటే.. జనాలతో కళకళలాడాల్సిన ప్రసాద్స్ ప్రాంగణం ఖాళీగా కనిపిస్తుండడం సినీ ప్రియులకు ఎంతమాత్రం రుచించేది కాదు.
This post was last modified on December 5, 2024 7:52 am
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…