సంక్రాంతి ఎంతో దూరంలో లేదు. నలభై రోజుల్లో పండగ హడావిడి మొదలైపోతుంది. ఇప్పటిదాకా డాకు మహారాజ్ ప్రమోషన్లు మొదలుకాలేదు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేశారు. చిన్న టీజర్ తప్ప ఎలాంటి కంటెంట్ బయటికి రాలేదు. పోటీలో ఉన్న గేమ్ ఛేంజర్ నుంచి మూడు పాటలు, ఒక టీజర్ రాగా చివర్లో డేట్ లాక్ చేసుకున్న సంక్రాంతికి వస్తున్నాం నుంచి గోదారి గట్టు సాంగ్ ఆల్రెడీ ఛార్ట్ బస్టర్ అయిపోయింది. ఇంకోవైపు రామ్ చరణ్ టీమ్ సైలెంట్ అయిపోయింది. 21న యుఎస్ లో జరగబోయే ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించిన పోస్టర్లు తప్ప ఇంకే సౌండ్ చేయడం లేదు. ఎందుకనే కారణాలు చూద్దాం.
ప్రస్తుతం బయ్యర్ వర్గాల్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పుష్ప 2 హడావిడే కనిపిస్తోంది. కనీసం వారం దాకా ఈ వేడి చల్లారేలా లేదు. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఈ నేపథ్యంలో ఇంకెవరు అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నించినా అవి పూర్తి స్థాయిలో జనాలకు చేరేలా లేవు. పుష్ప ప్రీమియర్ రేట్ల గురించి ఒక పక్క, ఓపెనింగ్ ఎంతొస్తుందనే దాని మీద చర్చలు ఇంకో వైపు, ఏ ఏ రికార్డులు బద్దలవుతాయనే డిస్కషన్లు, ఇంకోపక్క ఇలా ఎక్కడ చూసినా అల్లు అర్జున్ జపమే కనిపిస్తోంది. ముందు రోజు రాత్రే బెనిఫిట్ షోలు ప్లాన్ చేయడంతో ఆన్ లైన్ రచ్చ ఇంకా ఎక్కువగా ఉంది.
అందుకే బాలయ్య, చరణ్ ఇద్దరూ ఇంకొద్ది రోజులు సైలెంట్ గా ఉండి డిసెంబర్ 10 నుంచి రంగంలోకి దిగబోతున్నట్టు సమాచారం. రెండు వేర్వేరు ప్రొడక్షన్ హౌసులు కావడంతో ప్రమోషన్లు పోటాపోటీగా ఉండబోతున్నాయి. ఆన్ స్టాపబుల్ 4 కోసం ఈసారి వీళిద్దరి కాంబోలో ఒక ఎపిసోడ్ ఉండొచ్చనే టాక్ ఉంది. దాదాపు ఖరారైనట్టేనని అంటున్నారు. ఒకవేళ నిజమైతే అదో బంపర్ బొనాంజా అవుతుంది. డిసెంబర్ 20 నుంచి క్రిస్మస్ రిలీజుల హల్చల్ ఉంటుంది కాబట్టి వీలైనంతగా గేమ్ చేంజర్, డాకు మహారాజ్ లు పబ్లిసిటీ మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే పుష్ప 2 సెట్ చేయబోయే రికార్డులు మాములుగా ఉండవుగా.
This post was last modified on December 4, 2024 5:24 pm
వైసీపీకి కొన్నాళ్ల కిందట రాజీనామా చేసిన ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.. తెలుగు దేశం…
ఈ గురువారం భారీ అంచనాల మధ్య విడుదలైన పుష్ప-2.. ఆ అంచనాలను అందుకుంది. ఈ సినిమా చూసి మామూలు మాస్…
కడప మున్సిపల్ స్కూల్ లో జరిగిన పేరెంట్స్- టీచర్స్ మీటింగ్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్న…
ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పుత్రోత్సాహంతో సంతోషం వ్యక్తం చేశారు. `వెల్‌డన్ లోకేష్` అంటూ తన కుమారుడు,…
మధ్యలో కొన్నేళ్ల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద సినిమాలకు బెనిఫిట్ షోలు లేవు. ఇది స్టార్ హీరోల అభిమానులను…
కాలేజీలో సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేయడం పరిపాటి. ఇది అన్ని చోట్లా ఉన్నదే. అలాగే యాక్టర్స్ మధ్య కూడా ఇలాంటి…