నందమూరి బాలకృష్ణ కెరీర్ లో మరపురాని అద్భుతమైన సినిమాల్లో ఆదిత్య 369 ఒకటి. టెక్నాలజీ అంతగా అందుబాటులో లేని టైంలోనే సైన్స్ ఫిక్షన్ జానర్ ని టచ్ చేసి దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అందించిన క్లాసిక్ ఎన్ని దశాబ్దాలు దాటినా ఇంకా ఫ్రెష్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇళయరాజా సంగీతం, శ్రీకృష్ణ దేవరాయలుగా తండ్రిని గుర్తుచేసే ఆహార్యంతో బాలయ్య నటన, అమ్రిష్ పూరి విలనీ, పిల్లా పెద్దలను అలరించే యాక్షన్ ఇలా ఎన్నో అంశాలు విజయం సాధించడానికి దోహదం చేశాయి. 1991లో రిలీజైన ఈ కల్ట్ కి సీక్వెల్ కావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. తీరబోయే క్షణం వచ్చేసింది.
ఇది గతంలో బాలకృష్ణ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కానీ నిజంగా కార్యరూపం దాలుస్తుందా అనే అనుమానం అభిమానుల్లో లేకపోలేదు. దానికి స్వయానా ఆయనే సమాధానం చెప్పబోతున్నారు. ఎల్లుండి ఆహాలో స్ట్రీమింగ్ కాబోయే అన్ స్టాబుల్ 4 శ్రీలీల – నవీన్ పోలిశెట్టి ఎపిసోడ్ లో ఈ గుడ్ న్యూస్ వినొచ్చు. దానికి సంబంధించిన గెటప్ కూడా బాలయ్య వేసుకుని చూపించబోతున్నారు. ఆదిత్య 999 మ్యాక్స్ పేరుతో రూపొందబోయే ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ లో హీరోగా మోక్షజ్ఞ చేయబోతున్నాడు. తండ్రితో పాటు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్టు సమాచారం.
గతంలో స్టార్ తండ్రి కొడుకులు ఒకే సినిమాలో నటించడం చాలా సార్లు జరిగింది కానీ ఇలాంటి సీక్వెల్ కలయిక మాత్రం అరుదు. ఆదిత్య 999 మ్యాక్స్ కి భారీ విఎఫెక్స్ ఎఫెక్ట్స్ అవసరమవుతాయి. దానికి తగ్గట్టే పెద్ద బడ్జెట్ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో డెబ్యూ చేస్తున్న మోక్షజ్ఞ తర్వాత వెంకీ అట్లూరికి ఓకే చెప్పినట్టు టాక్. మూడోది ఆదిత్య 999 మ్యాక్స్ అవుతుందేమో చూడాలి. బాలయ్య స్వీయ దర్శకత్వం వహించే అవకాశం ఎక్కువగా ఉంది. అంచనాలు పీక్స్ లో ఉండటం ఖాయం. హీరోయిన్, సాంకేతిక వర్గం ఇంకా ఫైనల్ కాలేదు. వివరాలు ఒక్కొకటిగా బయటికొస్తాయి.
This post was last modified on December 4, 2024 5:13 pm
నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్ లో రూపొందుతున్న తండేల్ లో కీలక ఘట్టం డిసెంబర్ 22 జరగనుంది. పవిత్ర…
హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో…
పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ సంపాదించుకున్న సౌత్ దర్శకుల్లో అట్లీ ఒకడు. రాజా రాణి, తెరి, మెర్శల్, బిగిల్ లాంటి…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు, విడుదల వ్యవహారం సంచలనం…
ప్రభాస్ కొత్త సినిమా ‘రాజా సాబ్’ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుండగా.. ఆ సినిమా వాయిదా…
అల్లరి నరేష్ కెరీర్లో అతి పెద్ద హిట్.. సుడిగాడు. తమిళ బ్లాక్ బస్టర్ ‘తమిళ్ పడం’ ఆధారంగా తెరకెక్కినప్పటికీ.. తెలుగు…