పుష్పతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మాలీవుడ్ నటుడు ఫహద్ ఫాసిల్ బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నాడు. మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో తానేంటో ఋజువు చేసుకున్నాక ఇప్పుడు హిందీ మార్కెట్ కోసం రూటు మారుస్తున్నాడు. ముంబై టాక్ ప్రకారం ప్రేమకథల స్పెషలిస్ట్ గా పేరున్న ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రూపొందే లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. తనకు జోడిగా యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రిని ఎంపిక చేసుకున్నట్టు తెలిసింది. ఈ కాంబో ఎవరూ ఊహించనిది. విండో సీట్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఇంతియాజ్ స్వీయ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో రూపొందుతుందట.
జబ్ వీ మెట్ తో గుర్తింపు తెచ్చుకున్న ఇంతియాజ్ అలీతో మనకూ కొంత కనెక్షన్ ఉంది. ఇతను తీసిన సూపర్ హిట్ మూవీ లవ్ ఆజ్ కల్ నే త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనలో జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తీన్ మార్ గా రీమేక్ చేశారు. ఆశించిన విజయం అందుకోలేదు కానీ ఇంతియాజ్ టేకింగ్ విపరీతంగా నచ్చడం వల్లే పవర్ స్టార్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అప్పట్లో టాక్ వచ్చింది. కొంత కాలంగా రేసులో వెనుకబడిపోయిన ఇంతియాజ్ అలీ ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన అమర్ సింగ్ చమ్కీలాతో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. దానికి రెస్పాన్స్, అవార్డులు భారీ ఎత్తున పేరు తీసుకొచ్చాయి.
సో పుష్ప విలన్, యానిమల్ హీరోయిన్ జంటగా త్వరలో సినిమా చూడొచ్చన్న మాట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్ప తెచ్చిన ఫేమ్ ఫహద్ ఫాసిల్ ని అన్ని మార్కెట్లకు పరిచయం చేసింది. ఎస్ఫై భన్వర్ సింగ్ షెకావత్ గా పండించిన కూల్ విలనీ అల్లు అర్జున్ పాత్ర ఎలివేషన్ కు బాగా ఉపయోగపడింది. పుష్ప 2 ఫస్ట్ హాఫ్ అయ్యాక ఫాఫా పెర్ఫార్మన్స్ ని మెచ్చుకోకుండా ఉండలేరని బన్నీ ఇటీవలే ఈవెంట్ లో చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే దూకుడు కనక బాలీవుడ్ లోనూ చూపిస్తే అక్కడా జెండా పాతేయొచ్చు. పుష్ప ప్రభావం అలాంటిది మరి.
This post was last modified on December 4, 2024 4:53 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…