బాలీవుడ్ నటుడే అయినప్పటికీ వివేక్ ఒబెరాయ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ముఖ్యంగా రక్త చరిత్రలో పరిటాల రవి పాత్ర చాలా పేరు తీసుకొచ్చింది. వినయ విధేయ రామ ఎంత డిజాస్టర్ అయినా అందులో విలన్ గా ఇచ్చిన పెర్ఫార్మన్స్ మాస్ ని ఆకట్టుకుంది. అయితే వివేక్ చాలా కాలంగా పరిశ్రమకు దూరంగా ఉంటున్నాడు. మలయాళంలో లూసిఫర్, కన్నడలో రుస్తుం తర్వాత సౌత్ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా ఒప్పుకోలేదు. ఈ ఏడాది రోహిత్ శెట్టి వెబ్ సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్ లో మాత్రమే కనిపించాడు తప్పించి రెండేళ్లుగా బిగ్ స్క్రీన్ కి దూరంగా ఉన్నాడు. దానికి కారణాలేంటో తాజాగా వివరించాడు.అతని మాటల్లో అదేంటో చూద్దాం.
ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. హిట్లు అవార్డులు కొట్టినంత మాత్రాన ఛాన్సులు క్యూ కడతాయని గ్యారెంటీ లేదు. 2007లో ‘షూటౌట్ అట్ లోఖండ్’ వాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఎక్కడ చూసినా గణపత్ పాట హోరెత్తిపోయింది. దెబ్బకు బిజీ అవుతా అనుకుంటే ఏడాదిన్నర ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఆఫర్ల కోసం మీడియేటర్ల మీద ఆధారపడటం ఇష్టం లేదు. అందుకే వ్యాపారం మీద దృష్టి పెట్టా. దాంట్లోనే బిజీ అయ్యా. 22 సంవత్సరాల కెరీర్ లో కేవలం 67 సినిమాలు మాత్రమే చేయడానికి కారణం ఇదే. ఆర్థికంగా బాగా సెటిలైపోయాను.
చూశారుగా వివేక్ మాటలు. ఫైనాన్సియల్ గా భద్రంగా ఉండాలంటే సినిమాల కంటే బిజినెస్ ఉత్తమమని భావించాడు. ఈయన తండ్రి సురేష్ ఒబెరాయ్ బాలీవుడ్ లో పేరున్న నటుడు. 1988లో చిరంజీవి మరణ మృదంగం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు కానీ ఆ తర్వాత హిందీకే పరిమితమయ్యారు. యానిమల్ లో రన్బీర్ కపూర్ దాదాజీగా నటించింది ఈయనే. ఇప్పటికీ తండ్రి యాక్టివ్ గా వేషాలు వేస్తుంటే కొడుకు మాత్రం త్వరగా రిటైర్ కావడం ట్విస్ట్. వివేక్ ఒబెరాయ్ ఒప్పుకోవాలే కానీ ప్రస్తుతం విలన్ల కొరత తీవ్రంగా ఉన్న దక్షిణాది నుంచి బోలెడు అవకాశాలు సిద్ధంగా ఉన్నాయి. తనేమో ఆసక్తిగా లేడు మరి.
This post was last modified on December 4, 2024 4:12 pm
టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప మానియా నడుస్తోంది. మూవీ ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం, అల్లు అర్జున్..…
`సీజ్ ది షిప్` - గత నాలుగు రోజులుగా ఏపీలో వినిపిస్తున్న `డైలాగ్` ఇది! ఇటు సోషల్ మీడియాలోనూ.. అటు…
ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ హామీలను సీఎం…
ప్యాన్ ఇండియా స్థాయిలో సంచలనంగా మారిన 'పుష్ప 2: ది రూల్' సెగలు పక్క రాష్ట్రం కర్ణాటకలో బలంగా తగిలాయి.…
మరికొద్ది గంటల్లో 'పుష్ప 2: ది రూల్' ప్రీమియర్లు మొదలుకాబోతున్న తరుణంలో మెగా బ్రదర్ నాగబాబు ఒక ట్వీట్ చేయడం…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మంత్రి సుభాష్పై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారా? మంత్రి వ్యవహార శైలిపై…