Movie News

“నాకు తెలుగు వచ్చు, ‘అందరికీ నమస్కారం’ బ్యాచ్ ఐతే కాదు” – నిధి!

తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలీవుడ్ నుంచి వచ్చిన ఎందరో హీరోయిన్లు తమ లక్కు ట్రై చేసుకొని బాగా సక్సెస్ అయ్యారు. బాలీవుడ్లో ‘మున్నా మైఖేల్’ అనే మూవీతో తన సినీ కెరీర్ ప్రారంభించిన నిధి అగర్వాల్ 2018లో నాగచైతన్య సవ్యసాచి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అక్కినేని యంగ్ హీరోతో మూవీ మంచి లక్ తెస్తుంది అనుకున్న ఈ బ్యూటీకి సవ్యసాచి నిరాశ మిగిల్చింది. ఆ తర్వాత మరొక అక్కినేని హీరో అఖిల్ తో కలిసి మిస్టర్ మజ్ను మూవీ లో నటించింది. అయితే ఈ చిత్రం కూడా ఆమె అనుకున్న రేంజ్ సక్సెస్ను అంది ఇవ్వలేకపోయింది.

అయితే 2019లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఈ బ్యూటీ సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో ఆమె అందాలు అందరినీ ఆకట్టుకున్నాయి.. దీంతో తెలుగుతోపాటు తమిళ్లో కూడా వరుస అవకాశాలు వచ్చాయి. శింబు, జయం రవి లాంటి తమిళ్ స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి మెప్పించింది. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ మూవీ లో కూడా నటించింది. ఇక ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిస్టారిక్ డ్రామా ‘హరిహరవీరమల్లు’, ‘ప్రభాస్ రాజా సాబ్’ మూవీలలో మంచి ఛాన్స్ పట్టింది ఈ బ్యూటీ.

ఈ సినిమాలు ఆమెకు మంచి సక్సెస్ అందిస్తాయని అందరూ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్స్ తో ఇంటరాక్ట్ అయిన సందర్భంలో నిధి తనును అడిగిన ఒక ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.”మేడం మీకు తెలుగు వచ్చా?”అంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు నిధి తన స్టైల్లో సూపర్ రిప్లై ఇచ్చింది.”నాకు తెలుగు వస్తుందండి.. అయినా మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నేను ‘అందరికీ నమస్కారం’అనే బ్యాచ్ అయితే కాదు.”అని రిప్లై ఇచ్చింది నిధి.

అంతేకాదు, ఆమె ప్రభాస్ తో నటిస్తున్న రాజా సాబ్ సినిమా సెట్స్ లో కూడా ఎన్నో ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయని పేర్కొంది. ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి అని అభిమానులు అడిగినప్పుడు.. “ఆయన గురించి ఒక్క మాటలో చెప్పడం చాలా కష్టం.. అందరూ ఆయన్ని ఓ లెజెండ్ అంటారు, ఆయనకు చాలా పవర్ఫుల్ కళ్లు ఉన్నాయి.. ఇలా చెబుతూ పోతే ఆయన గురించి చాలా ఉంది.” అని చాలా తెలివిగా మెగా అభిమానుల మనసు దోచుకుంది నిధి.

This post was last modified on December 4, 2024 4:07 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

డిప్యూటీ సీఎం పదవికి ఓకే చెప్పిన షిండే!

మహారాష్ట్రకు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే భావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చివరి వరకు…

22 mins ago

లోకేశ్ కి రుణపడ్డానంటోన్న డ్రైవర్ లోవరాజు!

ఐటీ శాఖా మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తోన్న సంగతి…

55 mins ago

పెళ్లి ఫోటోస్ :- నాగ చైతన్య – శోభిత ధూళిపాళ్ల వైభవమైన వివాహం!

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఈరోజు ఓ ఇంటివాడయ్యాడు. గత కొంతకాలంగా ప్రేమిస్తున్న శోభిత ధూళిపాలతో ఈరోజు ఏడడుగులు నడిచాడు.…

1 hour ago

పుష్ప 2 ప్రమోషన్ల కోసం ప్రాణం పెట్టిన శ్రీవల్లి!

టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప మానియా నడుస్తోంది. మూవీ ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం, అల్లు అర్జున్..…

3 hours ago

`సీజ్ ది షిప్‌`: తెలుగు సినిమా టైటిల్ రిజిస్ట్రేష‌న్‌!

`సీజ్ ది షిప్‌` - గ‌త నాలుగు రోజులుగా ఏపీలో వినిపిస్తున్న `డైలాగ్‌` ఇది! ఇటు సోష‌ల్ మీడియాలోనూ.. అటు…

4 hours ago