చెన్నైలో డ్రగ్స్ కేసులు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. విలన్ గా పలు సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్న ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్ గురించి అందరికి తెలిసిందే. అయితే అతని కొడుకు డ్రగ్స్ కేసులో అరెస్టవ్వడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మన్సూర్ అలీఖాన్ కొడుకు అలీఖాన్ తుగ్లక్ గతంలోనే పలు వివాదాలతో ఇండస్ట్రీలో విమర్శలు అందుకున్నాడు. ఇక ఇప్పుడు డ్రగ్స్ కేసులో అరెస్టు కావడంతో విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
తిరుమంగళం పోలీసులు ఇటీవల నడిపిన ఆపరేషన్‌లో అలీఖాన్ తుగ్లక్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. గంజాయి, మ్యాజిక్ మష్రూమ్స్, మెథాంఫెటమిన్ వంటి డ్రగ్స్ అమ్మినట్లు నిర్ధారించారు. పోలీసుల విచారణలో, ఈ ముఠా ఆన్‌లైన్ ద్వారా డ్రగ్స్ అమ్మినట్లు తేలింది. కార్తికేయన్ అనే వ్యక్తి ఫోన్ ఆధారంగా డ్రగ్స్ వ్యాపారంలోకి అలీఖాన్ తుగ్లక్ సంబంధం వెలుగులోకి వచ్చింది.
మొదట కాలేజీ విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు, వారి ఫోన్ రికార్డుల ద్వారా అలీఖాన్ తుగ్లక్ పేరు గుర్తించారు. అతను కార్తికేయన్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి, వాటిని ఎక్కువ ధరకు అమ్మినట్లు తెలిపారు. వైద్య పరీక్షల్లో అలీఖాన్ తుగ్లక్ డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ అయింది. అతని స్నేహితులు సయ్యద్ షాహి, మొహమ్మద్ రియాజ్ అలీ, ఫైసల్ అహ్మద్‌లు కూడా ఈ డ్రగ్స్ చైన్‌లో భాగమైనట్లు తేలింది.
ఈ కేసులో నిందితులను కోర్టులో హాజరుపర్చిన పోలీసులు, వారి కస్టడీ కోసం అభ్యర్థించారు. డ్రగ్స్ అమ్మకం, వాడకం నేపథ్యంలో అలీఖాన్ తుగ్లక్ వంటి ప్రముఖుల సంబంధం బయటపడడంతో, ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. పోలీసుల వివరాల ప్రకారం, ఈ దందాలో ఇంకా పలువురి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
This post was last modified on December 4, 2024 2:31 pm
టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప మానియా నడుస్తోంది. మూవీ ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం, అల్లు అర్జున్..…
`సీజ్ ది షిప్` - గత నాలుగు రోజులుగా ఏపీలో వినిపిస్తున్న `డైలాగ్` ఇది! ఇటు సోషల్ మీడియాలోనూ.. అటు…
ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ హామీలను సీఎం…
ప్యాన్ ఇండియా స్థాయిలో సంచలనంగా మారిన 'పుష్ప 2: ది రూల్' సెగలు పక్క రాష్ట్రం కర్ణాటకలో బలంగా తగిలాయి.…
మరికొద్ది గంటల్లో 'పుష్ప 2: ది రూల్' ప్రీమియర్లు మొదలుకాబోతున్న తరుణంలో మెగా బ్రదర్ నాగబాబు ఒక ట్వీట్ చేయడం…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మంత్రి సుభాష్‌పై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారా? మంత్రి వ్యవహార శైలిపై…