పుష్ప 2 ది రూల్ కు పని చేస్తున్న సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టి స్టూడియో నుంచి తీసుకున్న పిక్ లో పుష్ప 3 ది ర్యాంపేజ్ అని ఉన్న ఫోటో ఒకటి ట్వీట్ ద్వారా బయటికి రావడంతో సోషల్ మీడియా ఒక్కసారిగా మూడో భాగం మీద చర్చ మొదలుపెట్టింది. నిజానికి థర్డ్ పార్ట్ గురించి చాలా ఊహాగానాలున్నాయి. కొంత భాగం తీశారని ఒకరు, లేదు ఇంకా తీయలేదని మరొకరు ఇలా రకరకాల ప్రచారం జరుగుతోంది. బాలయ్య ఆన్ స్టాపబుల్ 4లో ఈ ప్రశ్న ఎదురైనప్పుడు అల్లు అర్జున్ మాట్లాడుతూ అబ్బే ఇప్పట్లో కాదనే ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు. తిరిగి అంత సమయం ఖర్చు పెట్టలేననే హావభావం స్పష్టంగా కనిపించింది.
నిన్న జరిగిన హైదరాబాద్ ఈవెంట్ లో దర్శకుడు సుకుమార్ ఒకవేళ బన్నీ కనక ఇంకో మూడేళ్లు ఇస్తే తీస్తా అడగమంటూ ఫ్యాన్స్ ని టీజ్ చేయడంతో ఇక ఉండదనే అందరూ అనుకున్నారు. అయితే ఫోటో వెనుక మర్మం ఏమిటనే డౌట్ రావడం సహజం. ఇన్ సైడ్ టాక్ ప్రకారం పుష్ప 2 క్లైమాక్స్ లో పుష్ప 3 ది ర్యాంపేజ్ పేరుతో లీడ్ ఇచ్చి ఓపెన్ క్లైమాక్స్ పెట్టారు కానీ నిజానికి మరో సీక్వెల్ ఉంటుందో లేదో ఇప్పట్లో చెప్పలేరట. ఎందుకంటే అల్లు అర్జున్ కొంత విశ్రాంతి తీసుకున్నాక త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోయే ప్యాన్ ఇండియా మూవీలో బిజీ అయిపోతాడు. ఎంతలేదన్నా రిలీజ్ కో రెండేళ్లు పట్టొచ్చు.
ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో టి సిరీస్ సంస్థకో కమిట్ మెంట్ ఉంది. ప్రభాస్ స్పిరిట్ కాగానే వంగా చేసేది ఇదే కావొచ్చు. ఒకవేళ బన్నీ రావడం లేట్ అయితే యానిమల్ పార్క్ ఫినిష్ చేసుకుని ఇటు వస్తాడు. సో ఇవన్నీ జరిగేలోపు 2027 దాటిపోతుంది. ఇక సుకుమార్ సంగతి చూస్తే వచ్చే ఏడాది ఆగస్ట్ నుంచి రామ్ చరణ్ 17 సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి రెండు సంవత్సరాలు కనిష్ట సమయం. సో ఇద్దరూ బిజీ ఉన్నప్పుడు పుష్ప 3 ఎలా సాధ్యమనే సందేహం వస్తుందిగా. కెజిఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ కు ఎదురైనా సమస్య, ప్రశ్నలే సుకుమార్ కు ఎదురవుతున్నాయి.
This post was last modified on December 3, 2024 8:14 pm
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…