పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని డిజాస్టర్ అజ్ఞాతవాసి విడుదలకు ముందు ఒక ఫ్రెంచ్ మూవీ నుంచి స్ఫూర్తి పొంది త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ రాసుకున్నారనే దాని పెద్ద దుమారమే రేగింది. 2008లో వచ్చిన లార్గో వించ్ నే పవన్ ఇమేజ్ కి తగ్గట్టు మార్చి తీశారనే ప్రచారం చాలా జోరుగా సాగింది. ఇది ఎంత దాకా వెళ్లిందంటే దర్శకుడు జరోమ్ సల్లే సోషల్ మీడియా వేదికగా వరసబెట్టి కామెంట్లు పెట్టేదాకా. రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న టి సిరీస్ సైతం హారిక హాసినికి నోటీసు పంపిందనే వార్త రావడం అప్పట్లో హాట్ టాపిక్. తర్వాత సమస్య పరిష్కారం కావడం, బొమ్మ ఫ్లాప్ కావడం ఇదంతా గడిచిపోయిన స్టోరీ.
ఇప్పుడు అచ్చం ఇదే సమస్య అజిత్ విదాముయర్చికి వచ్చినట్టు చెన్నై టాక్. 2025 సంక్రాంతి విడుదలకు ఆఘమేఘల మీద రెడీ అవుతున్న ఈ చిత్రం 1997లో వచ్చిన హాలీవుడ్ మూవీ బ్రేక్ డౌన్ కు ఫ్రీ మేకట. ఈ మేరకు ఒరిజినల్ వెర్షన్ నిర్మించిన ప్రొడక్షన్ కంపెనీ నుంచి లైకా సంస్థకు 150 కోట్ల దాకా నష్టపరిహారం డిమాండ్ చేస్తూ నోటీసు వచ్చిందని కోలీవుడ్ రిపోర్ట్స్. అధికారికంగా దీన్ని చెప్పలేదు కానీ పరిశ్రమ వర్గాల్లో దీని గురించి చర్చ జరుగుతోంది. అయితే రోజులు గడుస్తున్నా ఇప్పటిదాకా ఇది అబద్ధమంటూ లేదా నిజమంటూ ఇరువైపులా ఎలాంటి అఫీషియల్ నోట్స్ రాకపోవడం అనుమానం పెంచింది.
ముందు బ్రేక్ డౌన్ కథ చూద్దాం. లాంగ్ డ్రైవ్ వెళ్తున్న హీరో కారు బ్రేక్ డౌన్ అవుతుంది. భార్యను అందులోనే ఉంచి రిపేర్ కోసం వెళ్తాడు. కానీ ఆమె తప్పిపోతుంది. దీని వెనుక ఉన్న మిస్టరీని ఛేదించడానికి పూనుకుంటాడు. ఈ క్రమంలో అనూహ్య సంఘటనలు జరుగుతాయి. ఊహించని ట్విస్టులు ఎదురవుతాయి. విదాముయర్చి టీజర్ గమనిస్తే ఈ లైన్ కు దగ్గరి పోలికలు కొన్ని కనిపిస్తాయి. మరి ప్రచారం జరుగుతున్నట్టు నిజంగా బ్రేక్ డౌన్ నే విదాముయర్చిగా మార్చారా లేక ఫోటోలు, టీజర్ చూసి ఇలా అనుకున్నారా వేచి చూడాలి. మొత్తం విదేశాల్లోనే షూటింగ్ జరుపుకున్న విదాముయర్చిలో భార్య పాత్రలో త్రిష నటించింది.
This post was last modified on December 3, 2024 7:58 pm
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…
భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…
యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…
నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…
ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…