సినిమా రివ్యూల విషయంలో తమిళ సినీ పరిశ్రమ ఈ మధ్య చాలా సీరియస్ అయిన సంగతి తెలిసిందే. వేట్టయాన్, కంగువ లాంటి సినిమాలు ప్రతికూల ఫలితాన్ని అందుకోవడానికి రివ్యూలే కారణమని అక్కడి నిర్మాతలు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే థియేటర్ల దగ్గర రివ్యూలు ఇవ్వడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని పట్ల మిశ్రమ స్పందన వచ్చింది. సినిమా టాక్ తెలుసుకునే హక్కు ప్రేక్షకులకు ఉందని.. రివ్యూలను ఆపాలనుకోవడం సమంజసం కాదని కొందరంటే.. షో పడీ పడగానే ఇన్‌స్టంట్ రివ్యూలు ఇచ్చి సినిమాను చంపేస్తున్నారని, బాగున్న సినిమాల గురించి కూడా ఎక్కువ నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని.. రివ్యూలకు ఇలా బ్రేక్ వేయడం సరైన నిర్ణయమే అని మరి కొందరన్నారు. ఐతే తమిళ నిర్మాతల మండలి ఇంతటితో ఆగకుండా ఇప్పుడు రివ్యూలను ఆపే విషయంలో మరో అడుగు ముందుకు వేసింది.
సినిమా రిలీజైన తొలి మూడు రోజులు ఇవ్వరూ రివ్యూలు ఇవ్వకుండా ఆపాలంటూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరుతూ మద్రాస్ హైకోర్టులో తమిళ నిర్మాతల మండలి పిటిషన్ వేసింది. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలోనూ రివ్యూలు రాకుండా నిషేధం విధించాలని ఈ పిటిషన్లో పేర్కొన్నారు. ఐతే సోషల్ మీడియా అనేది ఒక పెద్ద సముద్రం. ఇక్కడ సినిమా టాక్, రివ్యూలు రాకుండా ఆపడం అన్నది అంత తేలికైన విషయం కాదు. సినిమా ఎలా ఉందో తెలుసుకుని థియేటర్లకు వెళ్లే హక్కు ప్రేక్షకులకు ఉంటుంది కాబట్టి రివ్యూలు రాకుండా ఆపడం అన్నది సమంజసంగా అనిపించకపోవచ్చు. కాబట్టి కోర్టు ఈ విషయంలో నిర్మాతల ఆలోచనలను అంగీకరిస్తుందో లేదో చూడాలి. ఈ పిటిషన్‌ను విచారించిన అనంతరం కోర్టు ఏం తీర్పు ఇస్తుందో అని కోలీవుడ్ ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.
This post was last modified on December 3, 2024 6:01 pm
మహారాష్ట్రకు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే భావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చివరి వరకు…
ఐటీ శాఖా మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తోన్న సంగతి…
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఈరోజు ఓ ఇంటివాడయ్యాడు. గత కొంతకాలంగా ప్రేమిస్తున్న శోభిత ధూళిపాలతో ఈరోజు ఏడడుగులు నడిచాడు.…
టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప మానియా నడుస్తోంది. మూవీ ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం, అల్లు అర్జున్..…
`సీజ్ ది షిప్` - గత నాలుగు రోజులుగా ఏపీలో వినిపిస్తున్న `డైలాగ్` ఇది! ఇటు సోషల్ మీడియాలోనూ.. అటు…