పుష్ప 2 : ఇదంతా నా ప్రొడ్యూసర్స్ ఇచ్చిన సపోర్ట్ వల్లే…

పుష్ప 2 ది రూల్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎవరికిచ్చారనే సందిగ్ధం తొలగీ తొలగనట్టు కనిపిస్తోంది. ముందు తమన్ అన్నారు. అతనూ ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ ఫస్ట్ హాఫ్ లో తనకిచ్చిన బాధ్యత పూర్తి చేశానని అన్నాడు. తర్వాత అజనీష్ లోకనాథ్, సామ్ సిఎస్ పేర్లు వినిపించాయి. కానీ నిన్న హైదరాబాద్ వేడుకలో ఎక్కడా వీళ్ళ ప్రస్తావన రాలేదు. ఇంట్రో గురించి రాజమౌళి మాట్లాడుతూ డిఎస్పినే హైలైట్ చేశాడు. సుకుమార్, నిర్మాతలు సైతం తన పనితనాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. ముఖ్యంగా క్లైమాక్స్ గురించి బాగా ఎలివేట్ చేశారు. కట్ చేస్తే ఇవాళ సామ్ సిఎస్ థాంక్స్ ట్వీట్ పెట్టడం చిన్న ట్విస్ట్.

తనకు అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి మ్యాగ్నమ్ ఓపస్ కు పని చేయడం గొప్ప అనుభూతి ఇచ్చిందని పేర్కొంటూ ప్రత్యేకంగా పవర్ ప్యాక్డ్ ఫైట్ ఎపిసోడ్లు, క్లైమాక్స్ కు నేపధ్య సంగీతం ఇవ్వడం గురించి పేర్కొన్నారు. మరి దేవి ఎంత భాగానికి ఇచ్చాడు, సామ్ ఏఏ భాగాలకు పని చేశాడన్నది గుర్తించడం కష్టమనేలా ఉంది. రేపు థియేటర్లో చూశాక సౌండింగ్, ఇన్స్ ట్రుమెంట్స్ ని బట్టి ఏమైనా ట్రై చేయాలి తప్పించి ఒకే ప్రాజెక్టు మీద ఇద్దరు ముగ్గురు పని చేసినప్పుడు ఇదే సమస్య ఉంటుంది. ఎల్లుండి పుష్ప 2 బిగినింగ్ లేదా ముగింపు టైటిల్స్ లో పేర్లు చూశాకే ఒక క్లారిటీ వచ్చేలా ఉంది.

ఏది ఏమైనా దేవిశ్రీ ప్రసాద్ పుష్ప 2కి బెస్ట్ ఇచ్చాడనేది వాస్తవం. పాటలు దాన్ని ప్రూవ్ చేశాయి. పీలింగ్స్ లాంటి మాస్ సాంగ్ సైతం జనంలోకి బాగా వెళ్ళింది. దెబ్బలు పడతాయి ముందు అనుకున్నట్టు స్లో పాయిజన్ అయ్యింది. దానికి ముందు టైటిల్ సాంగ్, సూసెకి కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక ట్రైలర్ బీజీఎమ్ ఇచ్చింది దేవినే. నిన్న ఎక్కువ పొగడ్తలు దక్కింది కూడా తనకే. ఫైనల్ గా సినిమా బ్లాక్ బస్టర్ అయితే అదే సంతోషం. ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కోరుకుంటున్నది అదే. కిరణ్ అబ్బవరం ‘క’ విజయంలో కీలక పాత్ర పోషించిన సామ్ పుష్ప 2కి అంతకు పదింతలు ఇచ్చి ఉంటాడు.