బిగ్‍బాస్ షోకి సంబంధించి ఆడియన్స్ కి సస్పెన్స్ ఏమైనా వుంటే అది ఎవరు ఎలిమినేట్ అవుతారనే అంశం ఒక్కటే. ప్రతి వారం ఎవరు ఎలిమినేట్ అయ్యేదీ ముందే లీక్ అయిపోతోంది. శని, ఆదివారాలలో వచ్చే ఎపిసోడ్స్ శనివారమే షూట్ చేస్తుంటారు కనుక ఎలిమినేషన్ న్యూస్ ఒక రోజు ముందే బయటకు వస్తోంది. దీంతో గత రెండు వారాలలో లీక్స్ బయటకు రాకుండా కన్‍ఫ్యూజన్ క్రియేట్ చేసారు.
అయినా కానీ దేవి ఎలిమినేషన్ విషయంలో క్రియేట్ అయిన కన్‍ఫ్యూజన్ స్వాతి ఎలిమినేషన్ అప్పుడు రాలేదు. ఇప్పుడు కేవలం ఎలిమినేషన్ న్యూస్ మాత్రమే కాదు కెప్టెన్‍గా ఎవరు గెలిచారనే విషయాలు కూడా ముందే లీక్ అవుతున్నాయి. బిగ్‍బాస్‍లో మనకు చూపించేది ఎప్పుడూ ఒక రోజు డిలేతో వుంటుంది. అంటే ఆదివారం జరిగినది సోమవారం, సోమవారం జరిగినది మంగళవారం చూపిస్తుంటారు. అలా హౌస్‍లోని ఇంటర్నెల్ విషయాలు కూడా ఇప్పుడు లీక్ అవుతున్నాయి.
గతవారం కెప్టెన్‍గా కుమార్ సాయి గెలిచాడని ముందే లీక్ అవగా, ఈసారి సోహైల్ కెప్టెన్ అయ్యాడని లీకయింది. ఇంకా పది వారాల షో వుంది కనుక ఈ లీకులకు అడ్డుకట్ట వేయకపోతే ప్రేక్షకుల ఆసక్తి మరింత సన్నగిల్లిపోతుంది. ఇలాంటి లీక్స్ ఎవరి వల్ల బయటకు వెళుతున్నాయనేది గుర్తించి వారికి గట్టి వార్నింగ్ ఇస్తే సరి.
This post was last modified on October 8, 2020 3:34 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…