క్షణక్షణం షూటింగ్ ఒక షెడ్యూల్ ముదుమలై ఫారెస్ట్ లో ప్లాన్ చేశాం.. రాము ఫారెస్ట్ లో ఆట్మాస్ఫియర్ లో వాడతానికి ఒక ముళ్ల పంది కావాలని అడిగాడు..నేను స్పెషల్ ప్రాపర్టీస్ లిస్ట్ లో రాసి ప్రొడక్షన్ ఏక్సిక్యూటివ్ శరత్ కి ఇచ్చాను..ముళ్ల పంది ఎక్కడ దొరుకుతుంది అనేదాని మీద చర్చ జరిగింది..
అప్పట్లో పులి గోవిందు అని ఒకడుండేవాడు..అతడు అన్ని రకాల జంతువులను షూటింగ్ కి తీసుకొచ్చేవాడు..పులి..ఏనుగుల తో సహా..అతనిని పిలిపించి అడిగితే తనవల్ల కాదన్నాడు..నెక్స్ట్ ఎవరు అని ఫైట్ మాస్టర్ హార్సమన్ బాబుని అడిగితే తన అసిస్టెంట్ AR బాబు అనేవాడి పేరు చెప్పాడు..ముళ్ళపంది కావాలి అంటే రెండురోజులలో వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు..
రెండు రోజుల తర్వాత వచ్చి రెడీ సార్ అన్నాడు..ఏవిటి రెడీ అన్నాను నేను..ముళ్ళపంది రెడీ సార్ అన్నాడు..నేను ఆశ్చర్యంగా చుట్టూ చూసాను..లేదు.. అతనిని అడిగితే తీసుకురాలేదు సార్ ..రెడీ చేసి వచ్చాను అన్నాడు..అంటే అతని ఉద్దేశ్యం ముళ్ళపంది దొరుకుతుంది అని చెప్పడం…సరే వెళ్లి శరత్ గారితో మాట్లాడుకో అని చెప్పాను.. శరత్ దగ్గరకు వెళ్లి బేరం మొదలుపెట్టారు.. అతను ఏడు వేలు అడిగాడు..శరత్ కి షాక్..వెంటనే నా దగ్గరకు వచ్చి ..అతను ఏడు వెలు అడుగుతున్నాడు..నిజం గా దానితో అంత అవసరం ఉందా అన్నాడు..
సరే ఇక్కడికి రమ్మనండి మాట్లాడదాం అన్నాను..వచ్చాడు..చూడు బాబు ముళ్ళపంది టెమ్డేనా..(అంటే ట్రైనింగ్ ఇవ్వబడిందేనా)..అంటే..అదీ.. అదీ అంటున్నాడు..అసలు నువ్వు దాన్ని ఎక్కడినుండి తెస్తున్నావ్ అనిన అడిగా..మా ఫ్రెండ్ తెస్తాడు సార్..ఎక్కడ..అడివిలోనుంచి… మరి అది కెమెరా పెట్టి మనం వెళ్ళమన్నవైపుకి వెళుతుతుందా…చెప్పలేం సార్..సరే..ఇంకో టేక్ చేస్తాం..అప్పుడన్నా వెళుతుందా అన్నాను..సార్ అదీ.. అదీ అంటున్నాడు..నాకు మ్యాటర్ పూర్తిగా అర్ధమైంది..వీడి ఫ్రెండ్ వెళ్లి ఫారెస్ట్ లోకి వెళ్లి ఎదో తిప్పలు పడి ఒక మళ్ళపందిని పట్టుకుంటాడు..దాన్ని ఇచ్చి ప్రొడక్స్న్ లో ఎడు వేలు తీసుకుని వాడిచేతిలో ఒక వెయ్యిరూపాయలు పెడతాడు…
నేను డిసైడ్ అయ్యి పంది అక్కర్లేదులే అని శరత్ కి చెప్పాను..మరి రాముగారు కావాలన్నారుగా అని కంగారు పడుతున్నాడు.. నేను రాముతో మాట్లాడతాను అని చెప్పాను కానీ అతను సంసయిస్తున్నాడు..వెంటనే బాబు..సరే ఇదివేలు ఇప్పించండి సార్ మ్యానేజ్ చేస్తాను అన్నాడు..అప్ప్పుడు బాబుకి చెప్పాను…నువ్వొకపని చెయ్..మాములు పందిని ఒకదాన్ని తీసుకురా..500 ఇస్తారు..ముళ్ళు నేను తెప్పిస్తాను..సెట్ వాడి దగ్గర ఫెవికాల్ ఉంటుంది..షాట్ కి ముందు అందరం కలిసి దానికి ముళ్ళు అంటిద్దాం ఓకే నా..అన్నాడు..సార్ అని నోరు తెరిచాడు..అవును..నువ్వు తెచ్చే ముళ్ళ పంది కెమెరా పెట్టి వదిలితే మళ్లీ దొరకుండా పోతుంది..ఈ పంది అయితే వెంటబడి పెట్టుకోవచ్చు అని చెప్పి అసలు ముళ్ళపందిని క్యాన్సిల్ చేయండి..రాముతో నేను మాట్లాడతాను అనిచెప్పి పంపించాను..తర్వాత రాముకి ఎక్స్ప్లెయిన్ చేసి దానితో షాట్ తీయడం సాధ్యంకాదు అని చెప్పాను..rgv ఒకే అలాగే అన్నాడు..అదీ ముళ్ళపంది కధ…
— శివ నాగేశ్వర రావు
This post was last modified on October 8, 2020 3:00 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…