పుష్ప 2 ది రూల్ కు సంబంధించి ఎన్ని ఈవెంట్లు చేసినా పని ఒత్తిడి వల్ల ఇప్పటిదాకా బయటికి కనిపించనిది దర్శకుడు సుకుమార్ ఒక్కరే. చివరి నిమిషం దాకా పోస్ట్ ప్రొడక్షన్ చూసుకోవాల్సి రావడంతో పాట్నా, చెన్నై, కోచి, ముంబై ఎక్కడా ఆయన మాటలు వినే ఛాన్స్ దక్కలేదు. సెన్సార్ అయ్యాక కానీ ఆయన ఫ్రీ అవ్వలేదు. ఎట్టకేలకు హైదరాబాద్ యుసుఫ్ గూడలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ క్రియేటివ్ డైరెక్టర్ దర్శనం జరిగింది. మూడేళ్ళుగా బయట పెద్దగా కనిపించకుండా పుష్ప 2కే పూర్తిగా అంకితమైపోయిన సుకుమార్ తన మనసులో మాటలను పొదుపుగా అయినా సరే మనసారా పంచుకున్నారు.
ముందు అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ ఆర్య నుంచి తమ ప్రయాణం మొదలయిందని, ఒక నటుడిగానే కాక వ్యక్తిగా బన్నీ ఎదుగుదల చూసి గర్వపడుతూ ఉంటానని చెప్పారు. నటన పరంగా చిన్న ఎక్స్ ప్రెషన్, కనుబొమ్మ ఎగరేయడం, గొంతు వణికించడం ఇలా ఏదైనా సరే బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించే బన్నీ ఎనర్జీ టీమ్ లో ఉన్న మిగిలినవాళ్లను కూడా అంతే హైలో ఉంచుతుందని, పుష్ప కేవలం అతని మీద ప్రేమతో చేశానని సుకుమార్ చెబుతున్నప్పుడు కింద కూర్చుని చూస్తున్న బన్నీ కళ్ళలో ఎమోషన్ స్పష్టంగా కనిపించింది. సమయాభావం వల్ల ఎక్కువ మాట్లాడలేని నిస్సహాయత వ్యక్తం చేశారు.
ఇక పుష్ప 3 ప్రస్తావన తేవడం అసలు ట్విస్ట్. అభిమానులు పదే పదే డిమాండ్ చేయడంతో దానికి క్లారిటీ ఇచ్చేశారు. అల్లు అర్జున్ జీవితంలో ప్రైమ్ టైం అనిపించే మూడేళ్ళ విలువైన కాలాన్ని ఇప్పటికే తీసుకున్నానని, పుష్ప 3 ఉంటుందా లేదాని తర్వాత ఫ్రెండ్ ని అడుగుతానని మీరు కూడా అడిగి చెప్పండని ముగించడం కొసమెరుపు. అంటే చూచాయగా లేదనే సంకేతమే ఇచ్చారు. సుకుమార్ నెక్స్ట్ రామ్ చరణ్ 17 చేయాలి. బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో జత కడతాడు. సో పుష్ప 3 ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదు. ఒకవేళ పార్ట్ 2 బ్లాక్ బస్టర్ అయితే అనుకున్నదాని కన్నా కొంచెం ముందు మొదలుపెడతారేమో చూడాలి.
This post was last modified on December 2, 2024 11:23 pm
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…