పెద్ద హీరోల సినిమాలు మొదటి రెండు వారాలు చూడటం కష్టమనిపించేలా పుష్ప 2 టికెట్ రేట్లకు విపరీతమైన హైక్ ఇవ్వడం గురించి అన్ని వర్గాల్లోనూ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రీమియర్ కు ఏకంగా 800 రూపాయలు మంజూరు చేయగా ఆ తర్వాత రోజు నుంచి మల్టీప్లెక్సులకు 200, సింగల్ స్క్రీన్లకు 150 చొప్పున అనుమతి ఇవ్వడంతో ధరలు భారీగా కనిపిస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా ఉన్నప్పటికీ ఈ ధోరణి పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. అందుకే తాజాగా తెలంగాణ హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలయ్యింది.
ఇంత పెద్ద మొత్తంలో పెంపుని నిరసిస్తూ వేసిన పిటీషన్ రేపు హియరింగ్ కు రానుంది. న్యాయస్థానం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే నైజామ్ లో టికెట్ల అమ్మకాలు ఆన్ లైన్ లో పెద్ద ఎత్తున జరిగాయి. వందలాది షోలు హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. ఇప్పుడు ఒకవేళ కోర్టు ఏమైనా సవరించమని చెబితే పెద్ద ఇబ్బందే. కానీ అలాంటి పరిస్థితి రాకపోవచ్చని టాక్. ఎందుకంటే ఒకవేళ ఇలాంటి సమస్య వస్తే సమాధానం చెప్పేందుకు అవసరమైన బడ్జెట్ లెక్కలు, ఆధారాలు అన్నీ మైత్రి రెడీగా ఉంచుకుందట. అవి కన్విన్సింగ్ గా ఉంటే చిక్కు లేదు.
ఇంకో మూడు రోజుల్లో రిలీజ్ ఉండటంతో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ లో బుకింగ్స్ మొదలుపెట్టలేదు. ఏ క్షణమైనా జిఓ వస్తుందని బయ్యర్లు ఎదురు చూస్తున్నారు. అక్కడా ఇవే రేట్లు ఉంటాయని నిర్మాత నవీన్ చెప్పడం చూస్తే సాంకేతిక ఆలస్యం తప్ప రేట్లు ఫిక్స్ అయిపోయాయని అర్థమవుతోంది. దేవరకు పెంపు ఇచ్చినప్పుడు ఏపీ కోర్టులో పిటీషన్ నమోదయ్యింది. హైక్ ఇచ్చిన రోజులను తగ్గించి తీర్పు వచ్చింది. మరి పుష్ప 2కి అలా ఏమైనా జరుగుతుందో లేక కొట్టివేస్తారో చూడాలి. ప్రతి ప్యాన్ ఇండియా మూవీకి ఇలాంటి చిక్కులు ఇకపై తప్పేలా లేవు.
This post was last modified on December 2, 2024 9:18 pm
హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన పుష్ప 2 ది రూల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాస్…
కన్నడ మూవీ కిస్ తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. దర్శకేంద్రుడు తెరకెక్కించిన పెళ్లి సందడి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో…
తెలంగాణలో టికెట్ ధరల పెంపు, జీవోలు వచ్చేసి ఆన్ లైన్ అమ్మకాలు మొదలయ్యాక కూడా ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఆలస్యం…
కిక్కిరిసిపోయిన అభిమాన జనసందోహం మధ్య పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో ఘనంగా…
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి పది మాసాలే అయిందని.. ఈ పది మాసాల్లోనే అద్భుతాలు జరిగిపోతాయా? అని సీఎం…
2016 లో క్రేజీ బాయ్ అనే కన్నడ మూవీ తో సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది అషికా రంగనాథ్.…