తెలుగు సినిమాల్లో హీరోకు శారీరక లోపం ఉన్నట్లు కానీ.. అంద విహీనంగా కానీ చూపించేవారు కాదు ఒకప్పుడు. కానీ గత దశాబ్ద కాలంలో అంతా మారిపోయింది. హీరోకు లోపం పెట్టడం కూడా ఒక ట్రెండుగా మారింది. రామ్ చరణ్ లాంటి టాప్ హీరోను రంగస్థలం సినిమాలో చెవిటివాడిగా చూపించి పెద్ద షాకే ఇచ్చాడు సుకుమార్. కథలో ఆ లోపం కీలకంగా మారడం.. సినిమాకు కూడా ఓవరాల్‌గా ప్లస్ కావడం.. ప్రేక్షకులూ బాగా రిసీవ్ చేసుకోవడంతో ఇలాంటి ప్రయోగాలు మరిన్ని జరిగాయి. తన తర్వాతి చిత్రం పుష్పలో హీరోను గూనివాడిలాగా చూపించాడు సుక్కు. చిన్నతనంలో ఓ చేదు అనుభవం వల్ల హీరో భుజం పైకి వెళ్తుంది. సినిమా అంతా కూడా అలాగే కనిపిస్తాడు అల్లు అర్జున్.
ముందు హీరోను ఇలా చూపించడం ఆడ్‌గా అనిపించినా.. తర్వాత అలవాటు పడిపోయారు. పాటల్లో ఫైట్లలో.. ఇంకా ప్రతి సీన్లోనూ ఆ లోపాన్ని మెయింటైన్ చేస్తూ చాలానే కష్టపడ్డాడు బన్నీ.ఐతే పుష్ప-2 నుంచి లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన పీలింగ్స్ పాటలో బన్నీలో ఆ లోపం కనిపించలేదు. భుజం కిందికి వచ్చేసి.. మామూలుగానే దర్శనమిచ్చాడు. ఒకప్పట్లా ఈజ్‌తో స్టెప్స్ వేశారు. మరి ఉన్నట్లుండి ఈ మార్పు ఏంటి అన్నది జనాలకు అర్థం కావడం లేదు. హీరోకు కథలో భాగంగానే ఈ లోపం పోయి మామూలు అయిపోతాడా.. లేక ఇది డ్రీమ్ సాంగ్ కాబట్టి నార్మల్‌గా కనిపిస్తాడా అన్నది తెలియడం లేదు.
మొత్తంగా టీం హీరోకు ఈ లోపం ఉన్న విషయాన్ని మరిచిపోయి పీలింగ్స్ పాటలో నార్మల్‌గా చూపించేసిందా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. సుకుమార్ ఇలాంటి విషయాల్లో చాలా పర్టికులర్‌గా ఉంటాడు. మైన్యూట్ డీటైల్స్ కూడా మరిచిపోడు. సినిమా అంతా క్యారెక్టర్లు ఒకే రకంగా కనిపించేలా.. ప్రవర్తించేలా చూసుకుంటాడు. కంటిన్యుటీ మీద ప్రత్యేక శ్రద్ధ పెడతాడు. మరి పుష్ప-2 పాటలో మాత్రం ఆ మార్కు ఎలా మిస్ అయిందన్నది ఆశ్చర్యం కలిగించే విషయం. దీని వెనుక ట్విస్ట్ ఏంటో సినిమాలోనే చూడాలి మరి.
This post was last modified on December 2, 2024 7:06 pm
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…