టాలీవుడ్ లో మొట్టమొదటిసారిగా ఎప్పుడూ లేనంత టికెట్ రేట్ల హైక్ తెచ్చుకున్న పుష్ప 2 ఓపెనింగ్స్ పరంగా రికార్డులు సృష్టించడం ఖాయమనే మాటలో అనుమానం అక్కర్లేదు. నైజామ్ లో సగటు మల్టీప్లెక్స్ టికెట్ రేట్ 530 రూపాయలు ఉన్నా సరే మొదటి రోజు దాదాపు అడ్వాన్స్ హౌస్ ఫుల్స్ కావడం బన్నీ క్రేజ్ కు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ జీవో ఏ క్షణమైనా రావొచ్చు కానీ అది కూడా ఇంచుమించు తెలంగాణ ఇచ్చిన పెంపుకి దగ్గరగా ఉంటుందని ట్రేడ్ టాక్. హిట్ టాక్ వస్తే మాత్రం పుష్పరాజ్ ని పట్టుకోవడం కష్టం. కలెక్షన్ల సునామితో విరుచుకుపడతాడు. ఇప్పుడు సంక్రాంతి సినిమాల కనెక్షన్ ఏంటో చూద్దాం.
పుష్ప 2కి ఇంత వెసులుబాటు దక్కాక ఇకపై రాబోయే ప్యాన్ ఇండియా రిలీజులు అంతే మొత్తాన్ని ఆశిస్తాయి. ఈ వరసలో ముందొచ్చేది గేమ్ ఛేంజర్. నిర్మాత దిల్ రాజు, జీ స్టూడియోస్ దీని మీద మూడు వందల కోట్లకు పైనే ఖర్చు పెట్టారు. ఇంత మొత్తమని బయటికి చెప్పడం లేదు టీజర్ శాంపిల్స్ లోనే ఎంత గ్రాండియరో అర్థమైపోయింది. సో టికెట్ రేట్ల పెంపుకి పర్మిషన్లు అడిగినప్పుడు పుష్ప 2కి ఇచ్చినంతే మాకూ ఇమ్మని అడిగే అవకాశాన్ని కొట్టి పారేయలేం. బాలయ్య డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాంకు అంత భారీగా కాకపోయినా రెగ్యులర్ గా ఇచ్చే పెంపు కన్నా ఎక్కువే ఇచ్చే ఛాన్స్ ఉంది.
కాకపోతే పుష్ప 2 ఫలితం, ఫైనల్ గా ఎంత వసూలు చేస్తుందనే లెక్కల మీద ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఒకవేళ రాజమౌళి రికార్డులు కనక బద్దలైతే ఇకపై టయర్ 1 హీరోలు వాటి మీద కన్నేస్తారు. రేట్ల పెంపు కలెక్షన్ ఫిగర్ల మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి అది ఎంత మొత్తమనేది భవిష్యత్తులో డిస్ట్రిబ్యూటర్లు పెట్టే పెట్టుబడిని శాశిస్తుంది. మూడు టికెట్ల సొమ్ముని ఇప్పుడు ఒక్క ప్రేక్షకుడి నుంచే రాబట్టుకోవడం ద్వారా మొదటి రోజు నెంబర్లు ఊహలకు అందని విధంగా ఉండబోతున్నాయి. సంక్రాంతి రిలీజులకు సైతం ఇదే తరహాలో ప్రభుత్వాలు వరాలు కురిపిస్తే నిర్మాతలకు పండగే పండగ.
This post was last modified on December 2, 2024 5:35 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…