ఖాళీ సమయం దొరికితే చాలు కొందరి మేధాశక్తిని ఋజువు చేసుకోవడానికి సినిమాలు తప్ప వేరే సబ్జెక్టు ఉండదు. సరైన వాళ్ళు తగిలితే తప్ప వీళ్ళ నోటికి అడ్డుకట్ట వేయలేం. ఎక్స్ లో ది బ్యాడ్ డాక్టర్ అనే హ్యాండిల్ కు లక్షకుపైగా ఫాలోయర్స్ ఉన్నారు. ఈయనకు హఠాత్తుగా సౌత్ ఇండియన్ సినిమాల మీద చులకన అభిప్రాయం కలిగింది. వెంటనే ట్వీట్ పెట్టాడు. దాని సారాంశం ఇది. దక్షిణాది చిత్రాల్లో ఫార్ములా ఏంటంటే శుచీ శుభ్రత లేని చిన్న వ్యక్తి ఆత్మనూన్యతతో బాధపడుతూ ప్రేమించిన అమ్మాయి కోసం పది వేల మల్లయోధులను మట్టి కరిపిస్తాడు. దేనికయ్యా అంటే స్వంత తెలివి లేని అందమైన ప్రియురాలిని పడగొట్టేందుకు.
ఇది సదరు ఇంటలెక్చువల్ గారి తెలివి. దీన్ని చూసిన అడివి శేష్ స్పందిస్తూ ఇలా వివక్షతో కామెంట్ చేయొద్దంటూ, కావాలంటే తమ సినిమాలకు అమెరికా,జపాన్ లాంటి దేశాల్లో వస్తున్న స్పందన చూసి తెలుసుకోమని చురక వేశాడు. నిజానికి పైన చెప్పిన సదరు వ్యక్తి పుష్ప 2 ది రూల్ కొస్తున్న మేనియా చూస్తూ దుగ్ధతోనే పెట్టినట్టు అర్థమవుతోంది. దీనికి కామెంట్లు కూడా గట్టిగానే వస్తున్నాయి. కేవలం దెయ్యాలను నమ్ముకుని మాస్ సినిమాని చంపేసిన బాలీవుడ్ డొల్లతనం విస్మరించి ఇలా తెలుగు తమిళ దర్శకులు హీరోల మీద ఏడుపు ఎందుకంటూ ఫుల్లుగా ఎదురుదాడి కౌంటర్లు వేస్తున్నారు.
ఈ రకమైన అసూయ ఇప్పటిది కాదు. బాహుబలి నుంచే మొదలైంది. ఒక డబ్బింగ్ వెర్షన్ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టడం ముంబై పెద్దలకు జీర్ణం కాలేదు. తర్వాత ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్, కాంతారలాంటివి సరికొత్త మైలురాళ్ళు సృష్టించాయి. పుష్ప 2కి హిందీలో జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ మెంటల్ మాసనిపించేలా ఉన్నాయి. రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. హనుమాన్ కి దేశదేశాల్లో జేజేలు పలికారు. మహారాజా చైనాలో మతిపోయే కలెక్షన్లు సాధిస్తోంది. ఈ ఫీట్లేవి ఉత్తరాది మేకర్స్ కి సాధ్యం కావడం లేదు. ఏదేమైనా అడివి శేష్ ఇచ్చిన స్లిప్పర్ షాట్ మాత్రం పేలిపోయేలా ఉంది.
This post was last modified on December 2, 2024 1:48 pm
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…
అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…
రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…