ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న పుష్ప 2 ది రూల్ నుంచి మరో పాట వచ్చేసింది. కోచిలో జరిగిన ఈవెంట్ లో అల్లు అర్జున్ దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అన్ని భాషల్లో తొలి కొన్ని లైన్లు మలయాళంలోనే ఉంటాయని, ఇది కేరళ ఆర్మీ ఫ్యాన్స్ కి ఇస్తున్న కానుకని చెప్పడంతో అంచనాలు మరింత పెరిగాయి. సూసేకి అగ్గిరవ్వను మించి ఈ పీలింగ్స్ ఉంటుందనే నమ్మకం అభిమానుల్లో బలంగా కనిపించింది. మొన్న వదిలిన ప్రోమో కొన్ని సెకండ్లే అయినప్పటికీ సోషల్ మీడియాలో ఇట్టే వైరలైపోయింది. ఇప్పుడీ పీలింగ్స్ అనే ఊతపదం ఫుల్ మీల్స్ ఫీలింగ్ ఇచ్చేలా ఉంది.
ఆరింటికి ఓసారి, ఏడింటికోసారి, ఇలా గంటగంటకు వెంటపడే ప్రేమించే మొగుడితో పడే తిప్పల్ని గీత రచయిత చంద్రబోస్ వర్ణించిన తీరు వెరైటీగా ఉంది. మాములుగా లిరికల్ వీడియోలంటే కేవలం స్టిల్స్ మాత్రమే పొందుపరుస్తారు. దానికి భిన్నంగా ఏకంగా రెండు నిమిషాల పాటు ఒరిజినల్ వీడియోని ఇవ్వడం పుష్ప 2 మీద టీమ్ కున్న నమ్మకానికి నిదర్శనం. రష్మిక మందన్నను ఎత్తుకుని అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు బాగున్నాయి. రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన నృత్యరీతులు కనెక్టయ్యేలా ఉన్నాయి. అయితే వినగానే ఎక్స్ ట్రాడినరి కాదు కానీ స్లో పాయిజన్ లా ఎక్కడం జరగుతుంది.
జాతర పాట మినహాయించి పుష్ప 2 ఆడియో ఆల్బమ్ లోని అన్ని పాటలు వచ్చేసినట్టే. దాన్ని స్పెషల్ సర్ప్రైజ్ గా థియేటర్లోనే ఎక్స్ పీరియన్స్ చేయాలి కాబోలు. పుష్ప 1 ది రైజ్ తో పోలిస్తే దాని స్థాయిలో ఇందులో సాంగ్స్ ఉన్నాయా అంటే పెద్ద తెరమీద అనుభూతి చెందాక కానీ చెప్పలేం కాబట్టి కొంచెం వేచి చూడాలి. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే వైల్డ్ ఫైర్ అనిపిస్తున్న పుష్ప 2 కోసం డిసెంబర్ 4 రాత్రి సెకండ్ షో ప్రీమియర్లు రెడీ అవుతున్నాయి. దేవర తర్వాత మళ్ళీ అంతకుమించిన జనాల హడావిడి థియేటర్ల దగ్గర కనిపించనుంది. ఏడాది చివర్లో పుష్పరాజ్ చేయబోయే అరాచకం మాములుగా అయితే ఉండదు.
This post was last modified on December 1, 2024 6:40 pm
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…
ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి కీలకంగా మారిన మూడు మునిసిపల్ కార్పొరేషన్ల వ్యవహారం.. ఆసక్తిగా మారింది. రాజకీయ వర్గాల్లోనే కాదు..…
సాంకేతిక రంగంలో పెను విప్లవానికి దారి తీస్తున్న ఏఐ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకముందే ప్రపంచాన్ని హడలెత్తిస్తుంది. అణ్వాయుధాల కంటే…
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రూటు మాసరుస్తున్నారా..? నిన్నా మొన్నటి వరకు ప్రధాని మోదీకి నమ్మకమైన వ్యక్తిగా కొనసాగిన…
ఒక పార్టీపై చర్యలు తీసుకున్నా.. ఒక పార్టీ నాయకుడిపై చర్యలు తీసుకున్నా.. సహజంగానే ప్రజల్లో అంతో ఇంతో సింపతీ దక్కుతుంది.…