సోషల్ మీడియా జమానాలో హీరోలు దర్శకులు ఒకరిమీద ఒకరు పంచులు, జోకులు వేసుకోవడానికి నేరుగా కలుసుకోనవసరం లేదు. ఎక్స్ లో అకౌంట్ ఉంటే చాలు. కాకపోతే కొన్నిసార్లు ట్రెండ్ కు తగ్గట్టు వాళ్ళు చేసే హాస్యం అభిమానులకు మంచి టైం పాసవుతుంది. విషయానికి వస్తే తేజ సజ్జ తనకు హనుమాన్ విషయంలో వచ్చిన గొప్ప ప్రశంస రణ్వీర్ సింగ్ నుంచి వచ్చిందంటూ అతనితో కలిసి దిగిన ఒక ఫోటో పెట్టాడు. దానికి ప్రశాంత్ వర్మ బదులిస్తూ పిక్ క్రెడిట్స్ ఎక్కడని అడిగాడు. అంటే అక్కడ ఉద్దేశం ఫోన్ లో ఫోటో తీసింది నేనే కదా, దర్శకుడిగా నా గురించి చెప్పాలి కదాని. తేజ వెంటనే రెస్పాండ్ అయ్యాడు.
హుష్ వచ్చేశాడు అంటూ బ్రహ్మానందం ఎమోజి ఒకటి ట్వీట్ చేశాడు. తిరిగి ప్రశాంత్ వర్మ స్పందిస్తూ మనకి ఏం కావాలన్నా మనమే అడిగి తీసుకోవాలని ఒక తెలివైన మనిషి చెప్పాడని కోట్ చేస్తూ పంచు వేశాడు. వెంటనే నెటిజెన్లకు ఇది దేవిశ్రీ ప్రసాద్ ని ఉద్దేశించేనని అర్థమైపోయింది. పుష్ప 2 సాంగ్ లాంచ్ ఈవెంట్ లో క్రెడిట్స్ గురించి దేవి మాట్లాడుతూ ఏదైనా సరే అడిగి తీసుకోవాలంటూ అతను చేసిన కామెంట్స్ ఎంత వైరలయ్యాయో చూశాం. దేవికి నిర్మాతలకు మధ్య విభేదాలు ఉన్నాయనే తరహాలో చాలా కథనాలు వచ్చాయి. తర్వాత నిర్మాత రవిశంకర్ అదేమీ లేదంటూ క్లారిటీ ఇవ్వడం తర్వాత స్టోరీ.
మొత్తానికి ప్రశాంత్ వర్మ కౌంటరనాలో లేక పంచనాలో కానీ బాగానే పేలింది. హనుమాన్ తర్వాత మోక్షజ్ఞ డెబ్యూ మూవీ మీద పని చేస్తున్న ఈ క్రేజీ దర్శకుడు ఇటీవలే రిషబ్ శెట్టి జై హనుమాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవి కాకుండా సినిమాటిక్ యునివర్స్ ని విస్తరించే క్రమంలో ఇతర దర్శకులతో కొత్త ప్రాజెక్టులను అనౌన్స్ చేస్తున్నాడు. ప్రభాస్ తో హోంబాలే ఫిలింస్ ఒక ప్యాన్ ఇండియా మూవీ చేస్తుందనే ప్రచారం జరిగింది కానీ తర్వాత దాని గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ఉండకపోవచ్చనే టాక్ కూడా ఉంది. దేని సంగతి ఎలా ఉన్నా మోక్షజ్ఞ మూవీ మీద మాత్రం అంచనాలు తీవ్రంగా ఉన్నాయి.
This post was last modified on December 1, 2024 6:11 pm
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…