Movie News

హిట్టు కొట్టినా ఆ పాత్రలొద్దు – మీనాక్షి చౌదరి!

కెరీర్ పరంగా గుంటూరు కారం, ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం ప్రయోజనం కలిగించనప్పటికీ లక్కీ భాస్కర్ లాంటి బ్లాక్ బస్టర్ లో హీరోయిన్ గా నటించడం మీనాక్షి చౌదరి మార్కెట్ ని పెంచింది. అయితే ఇందులో పోషించిన పాత్రే తనను ఇప్పుడు భయపెడుతోందట. ఒక ఇంటర్వ్యూలో భాగంగా ప్రశ్నకు సమాధానమిస్తూ లక్కీ భాస్కర్ లో భార్య, పిల్లాడి తల్లిగా నటించడం పట్ల స్నేహితులు, బంధువులు భయపెట్టారని, ఇంత తక్కువ వయసులో ఇలాంటివి చేస్తే రాబోయే రోజుల్లో ఈ తరహా క్యారెక్టర్లే వస్తాయని చెప్పారట. దీంతో ఇకపై కథ ఎంత నచ్చినా సరే వైఫ్, మదర్ రోల్స్ కి ససేమిరా నో చెప్పేస్తానని అంటోంది.

ఇది కొంత వరకు కరెక్టే అయినా మరీ అంత గుడ్డిగా ఫాలో కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మహానటి లాంటి హెవీ ఎమోషనల్ మూవీలో కీర్తి సురేష్ ఏకంగా వయసు మళ్ళాక చనిపోయే పాత్ర చేసింది. అలాని స్టార్ హీరోలు పిలవకుండా లేరు. ఇది హిట్టయ్యాకే మహేష్ బాబు, విక్రమ్, వరుణ్ ధావన్ లాంటివాళ్ళతో జట్టుకట్టే ఆఫర్లు వచ్చాయి. గతంలో సౌందర్య పెళ్లి చేసుకుందాంలో రేప్ బాధితురాలిగా చేశాక కూడా చిరంజీవి, రజనీకాంత్ ఆఫర్లు వచ్చాయి. సో మీనాక్షి చౌదరి భయంలో న్యాయముంది కానీ కెరీర్ ప్రారంభంలో కొంత ప్రాక్టికల్ గా ఆలోచించాల్సిన అవసరముంది.

ఇటీవలే రిలీజైన రెండు సినిమాలు మీనాక్షి చౌదరికి నిరాశే మిగిల్చాయి. వరుణ్ తేజ్ మట్కా, విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ కనీసం యావరేజ్ అనిపించుకోలేకపోయాయి. ఇప్పుడు తన దృష్టి వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం మీద ఉంది. అయితే ఇందులో సీనియర్ హీరో మాజీ ప్రియురాలిగా నటించడం ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కాబట్టి దర్శకుఢు అనిల్ రావిపూడి ఇచ్చే కామెడీ మాస్ కోటింగ్ తన మీద ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. జనవరి 14 థియేటర్లలో అడుగు పెట్టబోతున్న ఈ ఎంటర్ టైనర్ కనక బ్లాక్ బస్టర్ అయితే తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేయొచ్చు.

This post was last modified on December 1, 2024 5:14 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

భారత్‌లోనే వారిని ఓడించండి: షోయబ్ అక్తర్

పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ చుట్టూ కొనసాగుతున్న వివాదంపై పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తనదైన శైలిలో స్పందించారు.…

23 mins ago

పుష్పరాజ్ తీసుకున్నాడు – గేమ్ ఛేంజర్ ఊరుకుంటాడా

టాలీవుడ్ లో మొట్టమొదటిసారిగా ఎప్పుడూ లేనంత టికెట్ రేట్ల హైక్ తెచ్చుకున్న పుష్ప 2 ఓపెనింగ్స్ పరంగా రికార్డులు సృష్టించడం…

1 hour ago

పెళ్లికలతో కలకలలాడుతున్న అక్కినేని కోడలు…

మరో రెండు రోజుల్లో వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్న శోభిత ధూళిపాల సరికొత్త పెళ్లికూతురు లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.…

1 hour ago

పవన్ మరో షిప్‌ను ఎందుకు చెక్ చేయలేదు?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సముద్రంలోకి వెళ్లి షిప్ పరిశీలించిన అంశం పై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని…

1 hour ago

కన్నప్ప కోసం మంచు మనవరాళ్లు!

మంచు ఫ్యామిలీ కలల చిత్రం.. కన్నప్ప. ఈ సినిమా చేయాలని మంచు విష్ణు కెరీర్ ఆరంభం నుంచి కలలు కంటూనే…

3 hours ago

చంద్ర‌బాబుతో ప‌వ‌న్ భేటీ.. కాకినాడ ఎస్పీ బ‌దిలీ త‌ప్ప‌దా?..

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వానికి నేత్రాల్లాంటి సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇద్ద‌రూ భేటీ అయ్యారు. అమ‌రావ‌తి ప‌రిధిలోని…

3 hours ago