సంవత్సరంలో ప్రతి నెల కనీసం ఏదో ఒక హిట్టు ఉంటే థియేటర్ల ఫీడింగ్ కు బాగుంటుంది. అలా కాకుండా ముప్పై రోజులు ఫ్లాపులతో నిండిపోతే అంతకు ముందు దీపావళి సినిమాలతో సరుకోవాల్సి ఉంటుంది. ఈసారి అదే జరిగింది. నవంబర్ మరీ నీరసంగా గడిచిపోవడం బయ్యర్లను కుదిపేసింది. అక్టోబర్ చివర్లో వచ్చిన అమరన్, క, లక్కీ భాస్కర్ లు వేసుకున్న థియేటర్లలు రెండు మూడు వారాలు నిక్షేపంగా గడిపేశాయి కానీ మిగిలిన స్క్రీన్లు మాత్రం కలెక్షన్ల కోసం ఆలో లక్ష్మణా అనాల్సి వచ్చింది. దీనికి తోడు పుష్ప 2 ది రూల్ ఫీవర్ ముందే మొదలైపోవడంతో జనాలు థియేటర్లకు దూరంగా ఉన్నారు.
ముందు బోణీ జరిగింది నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’తో. ఏళ్ళ తరబడి లేట్ అవుతూ వచ్చిన చివరికి అసలు రిలీజైన సంగతే గుర్తు లేనంతగా డిజాస్టరై వెళ్ళిపోయింది. ఆపై వారం ‘కంగువా’ అంచనాలు పూర్తిగా నీరుగార్చేసి సూర్య కెరీర్ లోనే అతి పెద్ద ఫ్లాప్ గా నిలిచింది. వరుణ్ తేజ్ ‘మట్కా’ మరీ అన్యాయం. హీరోని మోసం చేసిన డైరెక్టర్లు హిట్టవ్వలేదంటూ పెద్ద కామెంట్ చేసిన దర్శకుడు కరుణ కుమార్ ఆయన అదే రిపీట్ చేయడం ట్రాజెడీ. మూడో వారంలో విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ ప్రమోషన్లలో చాలా సౌండ్ చేశాడు కానీ కేవలం సెకండాఫ్ ట్విస్టులను నమ్ముకోవడం ప్రేక్షకులను మెప్పించలేదు.
మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా ‘దేవకీనందన వాసుదేవ’ రెండో రోజే చేతులు ఎత్తేయగా సత్యదేవ్ ‘జీబ్రా’ కొంచెం డీసెంట్ అనిపించుకుంది కానీ అదరహో అనిపించే స్థాయిలో పికప్, కలెక్షన్లు చూపించలేదు. ఉన్నంతలో కొంచెం బెటర్ అంతే. నెలాఖరులో వచ్చిన చిన్న సినిమాలేవీ ఆడియన్స్ దృష్టిలో పడలేదు. యూత్ లో ‘రోటి కపడా రొమాన్స్’ కొంత సౌండ్ చేసినా సక్సెస్ కొట్టడానికి అది సరిపోలేదు. ఇదంతా పుష్ప 2 ప్రభావమా లేక సరైన కంటెంట్ లేని ఫలితామా అంటే రెండూ పేర్కొనక తప్పదు. సాధారణంగా డ్రైగా ఉండే నవంబర్ కు ఈసారి సరైన సినిమా లేకపోవడం శరాఘాతంగా మారింది.
This post was last modified on December 1, 2024 5:09 pm
ఏపీలో వక్ఫ్ బోర్డును సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ రద్దు చేసింది...కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకురాబోతోన్న వక్ఫ్ చట్ట…
దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)…
బాలీవుడ్ స్టార్ హీరో.. మిస్టర్ ఇండియా అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ బాలీవుడ్ లో ఫ్యాషన్ దివాగా పేరు…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న పుష్ప 2 ది రూల్ నుంచి మరో పాట వచ్చేసింది. కోచిలో జరిగిన…
భారతీయ చిత్రాలకు కొత్తగా మంచి మార్కెట్ క్రియేట్ అయిన దేశాల్లో జపాన్ ఒకటి. 90వ దశకంలోనే ముత్తు సహా కొన్ని…
సోషల్ మీడియా జమానాలో హీరోలు దర్శకులు ఒకరిమీద ఒకరు పంచులు, జోకులు వేసుకోవడానికి నేరుగా కలుసుకోనవసరం లేదు. ఎక్స్ లో…