ఒక స్థాయికి చేరుకున్నాక అంతకుముందు చేసిన సినిమాల విషయంలో ఆర్టిస్టులకు పశ్చాత్తాపం కలగడం సహజం. ఎక్కువగా ఫ్లాప్ సినిమాల విషయంలో ఇలాంటి ఫీలింగ్ కలుగుతుంది. కానీ మంచి హిట్టవడమే కాక, ఆర్టిస్టుగా కూడా బాగా పేరు తెచ్చి పెట్టిన సినిమా విషయంలో ఒక నటుడు రిగ్రెట్ ఫీలవడం అరుదైన విషయమే. గత దశాబ్ద కాలంలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వెలుగులోకి వచ్చిన అద్భుతమైన ఆర్టిస్టుల్లో ఒకడిగా పేరు సంపాదించిన ఫాహద్ ఫాజిల్.. తమిళ హిట్ మూవీ ‘మామన్నన్’ విషయంలో పశ్చాత్తాప పడుతుండడం ఆశ్చర్యం కలిగించే విషయం.
వడివేలు, ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో ఫాహద్ విలన్ పాత్ర చేశాడు. కుల దురహంకారం, ఇగోతో రగిలిపోయే పొలిటీషియన్ పాత్రలో ఫాహద్ ఇందులో అద్భుతమైన నటన కనబరిచాడు. ఫాహద్ కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ పాత్రల్లో ఇదొకటి.ఐతే ఈ పాత్ర, కథ విషయంలో తనకేమీ అభ్యంతరాలు లేవని.. కానీ అందులో కుక్కల్ని చంపే సన్నివేశంలో నటించాల్సి రావడం తనకు ఎంతో బాధ కలిగించిందని ఫాహద్ తెలిపాడు.
తనకు కుక్కలంటే చాలా ఇష్టమని.. తన ఇంట్లో కూడా చాలా కుక్కలు ఉన్నాయని.. వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటానని.. అలాంటి తాను తెర మీద కుక్కల్ని చంపే పాత్ర చేయడం చాలా బాధ కలిగించిందని ఫాహద్ తెలిపాడు. అన్యమనస్కంగానే ఆ సన్నివేశంలో నటించానని.. కానీ తర్వాత ఆ సీన్ చూస్తే తట్టుకోలేకపోయానని.. ఈ సినిమా తాను చేయాల్సింది కాదనిపించిందని ఫాహద్ అభిప్రాయపడ్డాడు. తెర మీద చూపించింది అబద్ధమే అయినప్పటికీ.. తనకు అది బాధ కలిగించినట్లు ఫాహద్ చెప్పడం అతనెంత సున్నిత మనస్కుడో తెలియజేస్తుంది. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మామన్నన్’ తెలుగులో ‘నాయకుడు’ పేరుతో విడుదలై ఓ మోస్తరు ఫలితాన్నందుకుంది. తమిళంలో మాత్రం సూపర్ హిట్ అయింది.
This post was last modified on December 1, 2024 4:24 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…