ఒక స్టార్ హీరో తెలుగు సినిమాకు ఏపీ, తెలంగాణలో హైప్ ఉండటంలో ఆశ్చర్యం లేదు కానీ ఉత్తరాదికి డబ్బింగ్ రూపంలో వెళ్లే టాలీవుడ్ మూవీ కోసం బయ్యర్లు ఎగబడుతున్నారంటే మాత్రం ఖచ్చితంగా విశేషమే. రాజమౌళి దీన్ని బాహుబలితోనే సాధించగా ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ – సలార్, రిషబ్ శెట్టి కాంతారలతో చేసి చూపించారు. కానీ పుష్ప 2 ది రూల్ క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తోంది. హిందీ డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకున్న అనిల్ తదాని అతి పెద్ద రిలీజ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటిరోజు దేశవ్యాప్తంగా ఉన్న 80 శాతం పైగా థియేటర్లలో పుష్ప 2నే ప్రదర్శించేలా ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది.
డిసెంబర్ 5కి అక్కడి ట్రేడ్ వర్గాలు పుష్ప డే అని నామకరణం చేశాయి. అంటే దరిదాపుల్లో కూడా ఎవరు లేకుండా ప్రతి థియేటర్లో పుష్ప నామస్మరణ జరిగేలా వరస షోలతో హోరెత్తించబోతున్నారు. ఒక ఉదాహరణ చూద్దాం. నార్త్ ఇండియాలోనే ఐకానిక్ స్క్రీన్ గా పేరున్న సముదాయం ముంబై గెయిటీ గెలాక్సీ. ఇందులో ఉన్న ఆరు స్క్రీన్లను పూర్తిగా పుష్ప 2కే ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించుకోవడం ఇతర పంపిణీదారులను ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ టైంలో కొన్ని షోలు వేరే సినిమాలకు ఇచ్చిన దాఖలాలున్నాయి. కానీ పుష్ప 2కి స్పెషల్ ట్రీట్మెంట్ దక్కుతోంది.
ఇప్పటికే కేవలం మూడు మల్టీప్లెక్సుల నుంచే హిందీ వెర్షన్ అమ్మకాలు లక్ష టికెట్లు దాటాయి. గంట గంటకు నెంబర్ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నాలుగు రోజుల్లో ముందు చేసుకున్న ప్లానింగ్ కన్నా ఎక్కువ స్క్రీన్లు పుష్ప 2కి యాడవుతాయని డిస్ట్రిబ్యూటర్ల అంచనా. అంతగా టికెట్ల కోసం డిమాండ్ ఉందట. పుష్ప 1 ది రైజ్ ని విపరీతంగా ఆదరించిన ఉత్తరాది ప్రేక్షకులు రెండో భాగాన్ని ఎట్టి పరిస్థితుల్లో మొదటిరోజే చూడాలని డిసైడయ్యారు. అందుకే గురువారం వర్కింగ్ డే ఉన్నప్పటికీ చాలా వేగంగా హౌస్ ఫుల్స్ జరుగుతున్నాయి. సింగల్ స్క్రీన్లలో దేశవ్యాప్తంగా మాస్ జాతర చూడటం ఖాయమే.
This post was last modified on December 1, 2024 4:10 pm
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…
ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి కీలకంగా మారిన మూడు మునిసిపల్ కార్పొరేషన్ల వ్యవహారం.. ఆసక్తిగా మారింది. రాజకీయ వర్గాల్లోనే కాదు..…
సాంకేతిక రంగంలో పెను విప్లవానికి దారి తీస్తున్న ఏఐ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకముందే ప్రపంచాన్ని హడలెత్తిస్తుంది. అణ్వాయుధాల కంటే…
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రూటు మాసరుస్తున్నారా..? నిన్నా మొన్నటి వరకు ప్రధాని మోదీకి నమ్మకమైన వ్యక్తిగా కొనసాగిన…
ఒక పార్టీపై చర్యలు తీసుకున్నా.. ఒక పార్టీ నాయకుడిపై చర్యలు తీసుకున్నా.. సహజంగానే ప్రజల్లో అంతో ఇంతో సింపతీ దక్కుతుంది.…