భోళా శంకర్ ఇచ్చిన షాక్ దెబ్బకు ముందు ఒప్పుకున్న సినిమాను పక్కనపెట్టి మరీ విశ్వంభర ఒప్పుకున్న చిరంజీవి ఈసారి కథలను ఓకే చేసే విషయంలో దూకుడు చూపించడం లేదు. ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే అయిదారుగురు మార్కెట్ ఉన్న దర్శకులు కలిసినప్పటికీ స్క్రిప్ట్ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడం వల్ల గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే 5జి జనరేషన్ కుర్ర డైరెక్టర్లతో మెగాస్టార్ చేతులు కలపాలన్న ఫ్యాన్స్ కోరిక తీరేలా ఉంది. నాని దసరాతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలకు చిరు ఆమోదం తెలిపినట్టు ఫిలిం నగర్ అప్డేట్. ప్యారడైజ్ అయ్యాక ఇది సెట్స్ పైకి వెళ్తుందట.
వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్వినిదత్ నిర్మిస్తారని టాక్. అధికారికంగా ప్రకటన రాలేదు కానీ అంతర్గతంగా అంగీకారం జరిగిందని సమాచారం. శ్రీకాంత్ ఓదెల చిరుకి వీరాభిమాని. ఎంతగా ఆంటే మెగాస్టార్ పుట్టినరోజు ట్వీట్లు, ఇంటర్వ్యూలు చూస్తే అర్థమైపోతుంది. దసరా ఓపెనింగ్ సీన్ లో వచ్చే కల్లు కాంపౌండ్ ఎపిసోడ్ టీవీలో చూపించేది చిరంజీవి పాటే. పలు చోట్ల రెఫరెన్సులు వాడుతూనే వచ్చాడు. అంత ఫ్యానిజం ఉన్న శ్రీకాంత్ ఓదెల నిజంగా తన అభిమాన హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఏ స్థాయిలో ఎలివేట్ చేస్తాడో వేరే చెప్పాలా. కాకపోతే ప్రాజెక్టు మొదలవ్వడానికి ఆరేడు నెలలు పైనే పడుతుంది.
విశ్వంభర తప్ప చిరంజీవి ఇప్పటిదాకా ఏ కొత్త సినిమా ప్రకటించలేదు. నెమ్మదిగా అయినా పర్వాలేదు బెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ ఓదెల చెప్పిన ఒక లైన్ బ్రహ్మాండంగా నచ్చి డెవలప్ చేయమని చెప్పారట. మాస్ టేకింగ్ తో కొత్తగా ఆలోచించే శ్రీకాంత్ ఎలాంటి స్టోరీ రాసుకున్నాడో వేచి చూడాలి. ది ప్యారడైజ్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ కుర్ర దర్శకుడు ఎప్పుడూ చూడనంత వయొలెంట్ అవతారంలో నానిని ప్రెజెంట్ చేయబోతున్నాడు. బడ్జెట్ కూడా వంద కోట్లపైనే ఖర్చు పెడుతున్నారు. వచ్చే ఏడాది దసరా లేదా దీపావళి రిలీజ్ అనుకుంటున్నారు.
This post was last modified on December 1, 2024 4:06 pm
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…