ఎట్టకేలకు పుష్ప 2 ది రూల్ తెలుగు రాష్ట్రాల్లో మొదటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రంగం సిద్ధమవుతోంది. ముందు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నప్పటికీ అనుమతులు, ఇతరత్రా కారణాల వల్ల చివరి నిమిషం వరకు ప్రయత్నించి తర్వాత వద్దనుకున్నారు. ఆఘమేఘాల మీద యూసఫ్ గూడ మైదానంలో చేసుకోవడానికి పర్మిషన్ రావడంతో శరవేగంగా పనులు జరుపుతున్నారు. రేపు ఆదివారం కావడంతో జనసందోహం భారీగా ఉండబోతున్న నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేయడంలో బిజీగా ఉన్నారు. ఫ్యాన్స్ కి కిక్ సెంటిమెంట్ మరొకటి ఉంది.
గతంలో అల వైకుంఠపురములో, పుష్ప 1 ది రైజ్ రెండు ఈవెంట్లు ఇదే యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో జరిగాయి. ఒకటి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడితే మరొకటి అల్లు అర్జున్ కెరీర్ ని ప్యాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టింది. ఇప్పుడు ముచ్చటగా హ్యాట్రిక్ తో బన్నీ నెక్స్ట్ లెవెల్ కు వెళ్తాడని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ మైదానం కూడా చిన్నదే. పాట్నా, చెన్నైలోనే అన్ని లక్షల వేల మంది వచ్చినప్పుడు ఇక హైదరాబాద్ అంటే ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. కానీ పరిమిత పాసులు ఎన్ని ఇచ్చినా అపరిమితంగా వచ్చే అభిమానులను కంట్రోల్ చేయడం కత్తికొనల మీద నడవడమే.
ఇప్పుడు అందరి చూపు అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ కి ఏమేం చెప్పబోతున్నాడు, స్టేజి మీద ఏం చేస్తాడు అనే దాని మీదే ఉంది. అన్ని కార్యక్రామాలు అయిపోయాయి కాబట్టి దేవిశ్రీ ప్రసాద్ వచ్చి ఏమైనా కొత్త ముచ్చట్లు చెబుతాడా అనే ఆసక్తి నెలకొంది. అన్నింటి కన్నా కీలకం దర్శకుడు సుకుమార్ స్పీచ్. మూడేళ్ళుగా మీడియాకు చిక్కకుండా, ఇంటర్వ్యూలు ఇవ్వకుండా మొదటిసారి పబ్లిక్ స్టేజి మీదకు వస్తున్నారు. ఆయన మీద ఎంత ప్రేమ ఉందొ ఐకాన్ స్టార్ ముంబైలో ఓపెన్ గా చెప్పేశాడు. తనకు డైరెక్టర్ గా మొదటి ఛాన్స్ ఇచ్చిన బన్నీ గురించి సుకుమార్ ఏమేం ఎలివేషన్లు ఇస్తారో, పుష్ప 2 గురించి ఏం చెబుతారో లెట్ వెయిట్ అండ్ సి.
This post was last modified on November 30, 2024 9:46 pm
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…