క్షణక్షణం షూటింగ్ ఒక షెడ్యూల్ ముదుమలై ఫారెస్ట్ లో ప్లాన్ చేసాం.. సాధారణంగా ఔట్డోర్ ప్లాన్ చేసినప్పుడు అక్కడ షూటింగ్ లో వాడటానికి కావలసిన స్పెషల్ ప్రాపర్టీస్ అన్నీ ముందే రెడీ చేసుకుని తీసుకెళ్లడం ఆనవాయితీ..
అన్ని ప్రాప్స్ ప్యాక్ చేసుకున్నాం..ఫారెస్ట్ లో పరీష్ రావేల్ వాడటానికి ఒక వెహికిల్ కావాలి..అది ఏ వెహికిల్ అనేదాని మీద క్లారిటీ రాలేదు.. ఫియట్ 118..లేదా జిప్సీ..రెండింటిలో ఒక దానిని వాడదామని రాము చెప్పారు..
ఎదో ఒక దానికి ఫిక్స్ అవుదామని మూడు నాలుగు సార్లు అడిగినా కూడా దాటవేశాడు.. వెళ్ళటానికి ఇంకా మూడురోజుల ముందు రామూ ని అడిగాను..ఫారెస్ట్ లో ఏ వెహికల్ వాడదామని..ఎదో మూడ్ లో వుండి రెండూ తెప్పించండి అన్నాడు..
నేను ఇంకో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వేరే టాపిక్ లోకి వెళ్ళిపోయాడు.. విధి లేక నేను ప్రొడక్షన్ వాళ్ళకి చెప్పాను రెండూ తీసుకురండి అని.. విషయం గోపాల్రెడ్డి దగ్గరకు వెళ్లింది..ఆ సినిమాకి ఆయన కూడా ఒక నిర్మాత..నన్ను తన రూం లోకి పిలిపించాడు..
నాకు విషయం ఆర్ధ్యమైంది…నాగేశ్వరావ్.. రెండు వెహికల్స్ ఫారెస్టుకి తీసుకెళ్లడానికి ఎంత ఖర్చు అవుతుందో నీకు తెలుసా…నేను మౌనంగా నిలబడ్డాను..రెండింటికీ పెట్రోల్ పోయించి..ఇద్దరు డ్రైవర్ లను హైర్ చేసి..రెండు వెహికిల్స్ కి రెంట్ కడితే ఎంతవుతుందీ.. లేదూ రెంటినీ ఒక లారీలో ఎక్కించి పంపితే లారీ కిరాయి ఎంతవుతుంది.. ఇవేవీ ఆలోచించకుండా నీ ఇష్టానికి నువ్వు ఒక పేపర్ మీద రాసి ఆర్డర్ వేస్తే ప్రొడక్షన్ వాళ్ళు వెర్రి గొర్రెల్లా ఆ పేపర్ తెచ్చి నాకు చూపారు..ఎదో ఒక వెహికిల్ డిసైడ్ చేసి నాకు రేపు చెప్పు అని ఫుల్ క్లాస్ పీకాడు..నేను మౌనంగా తల ఊపి బయటకు వచ్చాను..
అదే రోజు సాయంత్రం రాము నన్ను తన రూం లోకి పిలిచి..ఏంటీ గోపాల్రెడ్డి మీమీద ఫైర్ అయ్యాడట అని అడిగాడు..ఏం లేదు రామూ..ఎదో క్యాజువల్ డిస్కషన్ అన్నాడు..మీరు నిజం దాస్తున్నారు..తేజ నాతో జరిగిందంతా చెప్పాడు అని గుచ్చి గుచ్చి అడిగాడు రాము..గోపాల్రెడ్డి అన్నదానిలో నాకు తప్పేమీ కనిపించలేదు..నిర్మాతగా అతని స్తానం లో ఎవరన్నా అలాగే మాట్లాడతారు..గోపాలరెడ్డి ఇంకా సంస్కారంగా మాట్లాడినట్టే అనుకుంటున్నాను..ఇంతకంటే దారుణంగా మాట్లాడే ప్రొడ్యూసర్స్ నాకు తెలుసు..అది కో డైరక్టర్ గా నా బాధ్యత..నేను ఆ విషయంలో విఫలమైయ్యాను కాబట్టి ఆయన వృధా ఖర్చు గురించి మాట్లాడాడు.. సరే వదిలేద్దాం..రేపు మళ్లీ చెబుతాను రెండు వెహికిల్స్ కావాల్సిందే అని…
ఒక్క క్షణం నిశ్శబ్దం..తర్వాత రాము అన్నాడు i feel proud of you nageswararao..మీ ప్లేసులో వేరే ఎవరన్నా ఈ ఇష్యు ని పెద్దది చేసి నేను గోపాల్రెడ్డి గొడవ పడేలా చేసేవారు..కానీ మీది కాని తప్పుని మీరు నెత్తిన వేసుకుని సైలెంట్ గా వున్నారు..అని నన్ను మెచ్చుకుని..ఇప్పుడు మీరు చెప్పండి..ఏ వెహికిల్ బెటరో అని సలహా నన్ను అడిగారు..జిప్స్సీ అయితే బెటర్..ఎందుకంటే అవసరమైతే దాని టాప్ కూడా రిమూవ్ చెయ్యొచ్చు టాప్ యాంగిల్ షాట్స్ కి కూడా ఉపయోగపడుతుంది.. కండిషన్ లో ఉంటుంది..పెట్రోల్ కూడా ఎక్కువ మైలేజ్ వస్తుంది..షూటింగ్ లేనప్పుడు ప్రొడక్షన్ పనులకు కూడా ఉపయోగపడుతుంది అని క్లియర్ గా వివరించి చెప్పాను..
ఒకే అని..మరి ఈ విషయం ముందే ఎందుకు నాకు చెప్పలేదు అన్నారు..( నన్ను చెప్పనిస్తే గా అని మనసులో అనుకుని)… కో డైరక్టర్ గా నా బాధ్యత నిర్మాతకి దర్శకుడికి మధ్య సయోధ్య కుదర్చాలి గానీ అయోధ్య ఏర్పర్చకూడదు. నెను మిమ్మలి కన్విన్స్ చేయాలనుకున్నాను కానీ నాకా అవకాశం దొరకలేదు.. ఇక్కడ గోపాల్రెడ్డి ఎమోషనల్ ఔట్ లెట్ జరగడం కూడా ఇంపార్టెంటే అని చెప్పాను. సైలెంట్ గా విన్నాడు రాము…నేను డైరెక్టర్ గా రాము సినిమా ప్రొడ్యూస్ చేయడానికి దోహదపడిన అంశాలలో ఇది కూడా ఒకటి అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు…..
— శివ నాగేశ్వర రావు
This post was last modified on October 8, 2020 12:58 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…