గత నెల మంచి అంచనాల మధ్య విడుదలైన శ్రీ విష్ణు సినిమా ‘స్వాగ్’ థియేటర్లలో అనుకున్నంత మేర ఆడలేకపోయింది. నెగెటివ్ టాక్‌తో మొదలైన ఈ చిత్రానికి ఓ మోస్తరు వసూళ్లే వచ్చాయి. కానీ ఆ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాక జనం బాగా చూశారు. ఓటీటీలో రిలీజైన దగ్గర్నుంచి ఓ వారం రోజులు ‘స్వాగ్’ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఆ టైంలో ఎక్కువమంది దృష్టిని సినిమాలో కొన్ని హిడెన్ థింగ్స్ ఆకర్షించాయి. శ్రీవిష్ణు అర్థం కానట్లు, ఏదో పిచ్చి భాషలో మాట్లాడినట్లు డైలాగుల్లో బూతులతో పాటు కొన్ని షాకింగ్ డైలాగులు ఉన్న విషయాన్ని నెటిజన్లు కనిపెట్టేశారు.
అవి సోషల్ మీడియాలో భలేగా ట్రెండ్ అయ్యాయి. దీంతో పాటుగా ‘స్వాగ్’ ఇంటర్వెల్ సీన్లో వచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ మీద చాలా చర్చ జరిగింది. అందులో పచ్చి బూతులతో నిండిన డైలాగ్‌ను పాటలాగా పాడి బ్యాగ్రౌండ్ స్కోర్‌లో మిక్స్ చేసేశారంటూ నెటిజన్లు దీని మీద పెద్ద డిస్కషన్ పెట్టారు. వాళ్లు చెప్పిన లిరిక్స్ నిజమేనా అన్న అనుమానాలు కూడా చాలామందిలో కలిగాయి. సెన్సార్ వాళ్లకు దొరక్కుండా బూతుల్ని భలే ఇరికించేశారే అంటూ నెటిజన్లు జోకులు వేశారు. ఐతే వీళ్ల ఊహాగానాలు అసలు వాస్తవమేమీ లేదని దర్శకుడు హాసిత్ గోలి తాజాగా స్పష్టం చేశాడు. అతను కొందరు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్లతో కలిసి ఓ యూట్యూబ్ ఛానెల్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా ‘స్వాగ్’ ఇంటర్వెల్ సీన్ బ్యాగ్రౌండ్ సాంగ్ గురించి డిస్కషన్ వచ్చింది. జనాలు అనుకుంటున్న లిరిక్స్ నిజంగానే సినిమాలో పెట్టారా అని అడిగితే.. అలాంటిదేమీ లేదని తేల్చేశాడు హాసిత్. నవ వికచ నరసింహా.. అంటూ సాగే సంస్కృత శ్లోకాన్ని బ్యాగ్రౌండ్ సాంగ్‌గా పెట్టామని.. కానీ నెటిజన్లు వాళ్లకు తోచిన లిరిక్స్ వాళ్లు రాసేసుకుని ప్రచారం చేసేసుకున్నారని అతను నవ్వుతూ చెప్పాడు. దీంతో హాసిత్ అండ్ టీంను అనవసరంగా అపార్థం చేసుకున్నామంటూ సోషల్ మీడియా జనాలు కామెంట్లు పెడుతున్నారు.
This post was last modified on November 30, 2024 5:35 pm
విజయ్ సేతుపతి సుడి బ్రహ్మాండంగా ఉంది. చైనా దేశంలో తన సినిమా రిలీజ్ అవ్వడమే గొప్పనుకుంటే మహారాజ ఏకంగా 40…
సినిమాలకు సంబంధించి థియేటర్లు, ఓటిటిల మధ్యే పోటీ ఉండటం చూశాం కానీ తాజాగా ఇప్పుడీ లిస్టులో ఆన్ లైన్ టికెట్…
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే,…
అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన "రామన్ రాఘవ్ 2.0" సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది శోభిత. అనంతరం అడవి శేష్ గూడచారి,…
మొన్న ఈటీవీ విన్ ఓటిటిలో రిలీజైన 'క' దాదాపుగా ఒక రోజు మొత్తం పైరసీ కాకుండా కట్టడి చేయడంలో సదరు…
అనంతపురం జిల్లా నేమకల్లులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొన్నారు రేపు ఆదివారం కావడంతో ఈ రోజు…